'డిజిటల్ అప్నాయే' ప్రచారం ద్వారా ఒక నెలలోనే కోటి మంది ఖాతాదార్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు డిజిటల్ చెల్లింపుల పద్ధతిలోకి తీసుకెళ్లినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆగస్టు 15న ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
నెల రోజుల్లో కోటిమంది 'డిజిటల్' ఖాతాదారులు - డిజిటల్ ఖాతాదారులు
ఒక నెలలోనే కోటి మంది ఖాతాదార్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు డిజిటల్ చెల్లింపుల పద్ధతిలోకి తీసుకెళ్లినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆగస్టు 15న ప్రారంభమైన 'డిజిటల్ అప్నాయే' కార్యక్రమంలో భాగంగా ఈ ఘనతను సాధించాయని తెలిపింది.
డిజిటల్
డిజిటల్ బ్యాంకింగ్ విభాగాలను ఉపయోగించేలా వినియోగదార్లను ప్రోత్సాహించడమే దీని ఉద్దేశం. దీని కింద ఒక్కో శాఖ కనీసం 100 మంది ఖాతాదార్ల(మర్చంట్లు కూడా)కు డిజిటల్ చెల్లింపులను అలవాటు చేయాలని బ్యాంకులను కోరింది ఆర్థిక శాఖ.