కొవిషీల్డ్ టీకా ధర ప్రకటించిన సీరం
12:51 April 21
కొవిషీల్డ్ టీకా ధర ప్రకటించిన సీరం
కొవిషీల్డ్ టీకా ధరను సీరం సంస్థ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సింగిల్ డోసు టీకాను రూ.400కు సరఫరా చేయనున్నట్లు తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులకు సింగిల్ డోసుకు రూ.600 చొప్పున విక్రయించనున్నట్లు పెర్కొంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
అదే కేంద్ర ప్రభుత్వానికి సీరం.. రూ. 150 రూపాయలకే ఒక డోసును విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా టీకాలు కొనుగోలు చేసేందుకు, తయారీ సంస్థలు బహిరంగ మార్కెట్లో విక్రయించుకునేందుకు కేంద్రం అనుమతించింది.
మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారందరికీ టీకా అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సూచన మేరకే ధరలను ప్రకటిస్తున్నట్లు సీరం సంస్థ తెలిపింది.