తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆశల పల్లకిలో మదుపర్లు- లాభాల్లో మార్కెట్లు - నిఫ్టీ

నూతన ఆర్థిక సంవత్సరం రెండో రోజునా స్టాక్​మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులే ఇందుకు కారణం.

అంతర్జాతీయ సానుకూలతలు-లాభాల్లో సూచీలు

By

Published : Apr 2, 2019, 11:37 AM IST

స్టాక్​మార్కెట్లు వరుసగా 4వ సెషన్​లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. గత 3 సెషన్లలో 739 పాయింట్లు ఎగబాకిన బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ... నేడు మరో 85 పాయింట్లు వృద్ధిచెందింది. ప్రస్తుతం సెన్సెక్స్​ 38 వేల 960వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 11 వేల 690వద్ద కొనసాగుతోంది.

ఇవీ కారణాలు...

⦁ రిజర్వు వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న ఆశలు
⦁ చైనా స్థూల ఆర్థిక గణాంకాలు సంతృప్తికరంగా ఉండడం
⦁ అమెరికా-చైనా వాణిజ్య చర్చలు సఫలమవుతాయన్న అంచనాలు

ఆరంభంలో పెద్దఎత్తున కొనుగోళ్లు జరగ్గా... సెన్సెక్స్​ ఓ దశలో 39 వేల మార్కును దాటింది. నిఫ్టీ 11 వేల 700 పాయింట్ల మార్కును అధిగమించింది. తర్వాత సూచీలు కాస్త నెమ్మదించాయి.

చమురు... రూపాయి...

చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. బ్యారెల్ ధర 67.17డాలర్లకు చేరింది.

రూపాయి 22 పైసలు క్షీణించి డాలరుతో మారకం విలువ 69.36 వద్ద ఉంది. దిగుమతిదారులు, బ్యాంకుల నుంచి డాలర్​​కు డిమాండ్​ పెరగడమే ఇందుకు కారణం.

ABOUT THE AUTHOR

...view details