మరికొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా కోరారు. 130 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని ఇందుకోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు.
'కేంద్ర బడ్జెట్ కోసం సలహాలు ఇవ్వండి'
కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌పై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. బడ్జెట్ కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇచ్చే సలహాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని మోదీ ట్వీట్ చేశారు.
'కేంద్ర బడ్జెట్ కోసం సలహాలు ఇవ్వండి'
బడ్జెట్‌పై ప్రజలు ఇచ్చే సలహాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుందని మోదీ ట్వీట్ చేశారు. రైతులు, విద్య, ఇతర అంశాలకు సంబంధించిన సలహాలను mygov.in వెబ్‌సైట్‌కు షేర్ చేయాల్సిందిగా మోదీ కోరారు.
బడ్జెట్‌కు సంబంధించిన సలహాలు ఇవ్వాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ గతంలోనే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.