పెట్రోల్ ధరలు మళ్లీ వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. దిల్లీలో శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు పెరిగింది. ఇతర మెట్రో నగరాల్లోనూ లీటర్‌కు 17 నుంచి 20 పైసల వరకు ధర పెరిగింది. డీజిల్ ధరలు మాత్రం రెండు వారాలుగా స్థిరంగా ఉన్నాయి.
లీటర్ పెట్రోల్ ధర
By
Published : Aug 21, 2020, 10:35 AM IST
పెట్రోల్ ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 19 పైసల మేర ధర పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దీనితో లీటర్ పెట్రోల్ ధర దిల్లీలో రూ.81.25 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ రూ.73.62 వద్ద స్థిరంగా ఉంది.
అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలకు అనుగుణంగా.. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
ఇతర మెట్రో నగరాల్లోనూ 17 నుంచి 20 పైసల మేర పెట్రోల్ ధర పెరిగింది. డీజిల్ ధరలు మాత్రం గత రెండు వారాలుగా స్థిరంగా ఉన్నాయి.