దేశంలో పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. దేశ రాజధాని దిల్లీలో శనివారం.. గత రెండేళ్ల తర్వాత తొలిసారిగా లీటరు పెట్రోల్ ధర రూ.83కు చేరుకుంది.
చమురు సంస్థలు శనివారం లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి. తాజా పెంపుతో దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.83.12కు, లీటర్ డీజిల్ ధర రూ.73.32కు చేరుకుంది. 2018, సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక రేటు. నవంబర్ 20 నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచటం ఇది 13వ సారి. గత 16 రోజుల్లో లీటరు పెట్రోల్ ధర రూ.2 పెరగగా.. డీజిల్ రూ.2.86 మేర పెరిగింది.