ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ఇంధన ధరలు - డీజిల్ ధరలు
09:20 May 14
ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ఇంధన ధరలు
ఒకరోజు విరామం తర్వాత మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 29పైసలు, డీజిల్‌పై 34 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ వారంలో బుధవారం వరకు పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు.. గురువారం పెరగలేదు. ఇవాళ మళ్లీ ఇంధన ధరలు పైకి కదిలాయి. తాజా పెంపుతో దిల్లీలో లీటర్ పెట్రోల్ 92 రూపాయల 34 పైసలు, డీజిల్ 82 రూపాయల 95పైసలకు చేరింది.
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 95 రూపాయల 96 పైసలు ఉండగా.. డీజిల్ 90 రూపాయల 40 పైసలకు పెరిగింది. 8 రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూపాయి 94 పైసలు, డీజిల్‌పై 2 రూపాయల 22 పైసలను చమురు సంస్థలు పెంచాయి.