తెలంగాణ

telangana

ETV Bharat / business

పేటీఎం అపరిమిత చెల్లింపులకు ఒకే క్యూఆర్​ కోడ్​ - పేటీఎం సౌండ్ బాక్స్

డిజిటల్ చెల్లింపులకు అనువుగా అన్ని యుపీఐ ఆధారిత పేమెంట్ యాప్​ల నుంచి అపరిమిత చెల్లింపులు జరపుకునే విధంగా కీలక మార్పులు చేపట్టింది పేటీఎం. ఆల్​ ఇన్​ వన్ క్యూఆర్​ను ప్రారంభించింది. దీన్ని వినియోగించి పేటీఎం వాలెట్​ సహా రూపే కార్డుల నుంచి ఎలాంటి ఛార్జీలు లేకుండా.. నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో పాటు మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది.

Paytm launches all-in-one QR for merchants
పేటీఎం అపరిమిత చెల్లింపులకు ఒకే క్యూఆర్​ కోడ్​

By

Published : Jan 9, 2020, 6:08 AM IST

డిజిటల్ చెల్లింపులకు అనువుగా వర్తకుల కోసం ఆల్​ ఇన్​ వన్​ క్యూఆర్ కోడ్​ను ప్రారంభించినట్లు డిజిటల్ పేమెంట్స్​ సంస్థ పేటీఎం ప్రకటించింది. ఈ క్యూఆర్ ఉపయోగించి పేటీఎం వాలెట్, రూపే కార్డులు సహా యుపీఐ ఆధారిత అన్ని పేమెంట్ యాప్​ల నుంచి అపరిమిత చెల్లింపులు జరపుకోవచ్చని తెలిపింది.

వ్యాపారులు ఎలాంటి ఛార్జీలు లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసుకోవచ్చని పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. పేటీఎం వాలెట్, యూపీఐ యాప్​లు, కార్డుల ద్వారా చెల్లింపులు చేసుకోగలిగిన ఏకైక క్యూఆర్ ఇదేనని ఆయన వెల్లడించారు. వర్తకుల ఉపయోగార్థం పవర్​బ్యాంకులు, గడియారాలు, రేడియో వంటి వాటిపై ముద్రించేందుకు వీలుగా ఈ క్యూఆర్ కోడ్​లను రూపొందించినట్లు తెలిపారు.

సౌండ్ బాక్స్

ఆల్​ ఇన్​ వన్​ క్యూఆర్​తోపాటు పేమెంట్ లావాదేవి విజయవంతం అయిన విషయాన్ని ధ్రువీకరిస్తూ ఆడియో సందేశం అందించే 'సౌండ్​బాక్స్​' పరికరాన్ని తయారు చేస్తున్నట్లు పేటీఎం ప్రకటించింది. ఈ పరికరం అన్ని రకాల చెల్లింపులకు సహకరిస్తూ... బహుళ భాషల్లో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

బిజినెస్ ఖాతా

క్యూఆర్​తో పాటు 'పేటీఎం బిజినెస్ ఖాతా' సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది సంస్థ. వర్తకులు తమ రోజువారీ నగదు, నగదేతర లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details