తెలంగాణ

telangana

ETV Bharat / business

నైట్​ షిఫ్టులతో ఐటీ ఉద్యోగులు సతమతం! - ఐటీ ఉద్యోగులు

తీవ్రమైన పనిభారం, పెద్ద పెద్ద లక్ష్యాలు, సుదీర్ఘ రాత్రి షిప్టులతో దాదాపు 25 శాతం మంది ఐటీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని మైండ్​మ్యాచ్​ నివేదిక పేర్కొంది. అన్ని ఐటీ డొమైన్లల్లోని 22 నుంచి 47 ఏళ్ల మధ్య వయస్సు గల 10,117 మంది నిపుణుల అభిప్రాయాలు ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది.

Over 25% of IT workforce highly stressed
తీవ్ర ఒత్తిడితో ఐటీ ఉద్యోగులు సతమతం!

By

Published : Feb 5, 2020, 12:45 PM IST

Updated : Feb 29, 2020, 6:34 AM IST

ఐటీ రంగంలో దాదాపు 25 శాతం మంది తమ రోజువారి జీవితంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారని మైండ్ మ్యాచ్ నివేదిక తెలిపింది. తీవ్రమైన పనిభారం, పెద్ద పెద్ద లక్ష్యాలు, సుదీర్ఘ రాత్రి షిప్టులే ఇందుకు కారణమని పేర్కొంది.

ఒత్తిడిలో యువత

ఈ 25 శాతంలో సగం కంటే ఎక్కువ మంది నిపుణులు (63.45 శాతం) కేవలం 0 నుంచి 4 ఏళ్ల అనుభవం కలిగిన యువ ఉద్యోగులేనని మైండ్​మ్యాచ్ స్పష్టం చేసింది.

ఎస్​సీఐకేఈవై మైండ్​మ్యాచ్​ ఆల్గారిథం నుంచి ఈ నివేదిక రూపొందించారు. అన్ని ఐటీ డొమైన్లల్లోని 22 నుంచి 47 ఏళ్ల మధ్య వయస్సు గల 10,117 మంది నిపుణుల అభిప్రాయాలు ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.

ఒత్తిడి కారణాలు

ఒత్తిడికి దారితీసే కారణాల్లో కుటుంబ సమస్యలు (79 శాతం) ప్రథమ స్థానంలో ఉన్నాయి. తరువాత స్థానాల్లో కార్యాలయాల్లో పని ఒత్తిడి (72.99 శాతం), ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు (63.64 శాతం), ఆరోగ్య సమస్యలు (52.04 శాతం), ప్రయాణ సమస్యలు (47.69 శాతం), ప్రేరణలేకపోవడం (32.46 శాతం) ఉన్నాయి.

వామ్మో కుటుంబ సమస్యలు

కుటుంబ సమస్యలు ఉన్నాయని చెప్పుకునే నిపుణుల్లో 41.29 శాతం మంది.. తమ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం చాలా కష్టమని, ఇదే ఒత్తిడికి దారితీస్తోందని తెలిపారు.

'కుటుంబాన్ని పోషించాలంటే డబ్బు కావాలి. అందుకోసం కార్యాలయాల్లో ఎక్కువ పనిగంటలు గడపాలి. ఫలితంగా కుటుంబ సభ్యులతో గడపలేకపోవడం.. ఇది కాస్తా గొడవలకు దారితీయడం.. చివరికి మనం ఒత్తిడి లోనవడం జరుగుతుందని' వీరు వాపోతున్నారు.

మరికొందరికి సరిపోయేంత జీతం ఉండదు. సొంతంగానూ సంపాదించే ప్రయత్నం చేయరు. ఈ నిరాశను కుటుంబ సభ్యులపై చూపించి సమస్యల వలలో చిక్కుకుంటారని నివేదిక తెలిపింది.

ఆరోగ్య సమస్యలు

ఒత్తిడి మూలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తిన వారు 52.04 శాతం మంది. నిజానికి వీరిలో 90.96 శాతం మంది ఆరోగ్యకరమైన దేహం కోసం, ప్రశాంతతకోసం మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు. దానికి ప్రధాన కారణం షిఫ్ట్ సిస్టమ్​, నైట్ షిఫ్ట్​ లు ఉండటమే. అయితే గుడ్డిలో మెల్లలాగా కేవలం 13.38 శాతం మంది మాత్రమే స్థిరమైన ఆరోగ్య అలవాట్లను పాటించగలుగుతున్నారు.

నైపుణ్యం క్షీణిస్తోంది.

ఒత్తిడి వల్ల కొంతమంది నిపుణులు తమ నైపుణ్యం క్షీణిస్తోందని అభిప్రాయపడుతున్నారు. కొత్తగా వచ్చిన వారితో పోల్చితే తమ అనుభవం, నైపుణ్యం క్షీణిస్తున్నట్లు తాము గుర్తించామని 0.73 శాతం మంది భావిస్తున్నారు. కానీ దారుణమైన విషయం ఏమంటే, 41.31 శాతం మంది ఫ్రెషర్స్​ ఒత్తిడి వల్ల తమ నైపుణ్యాలు కోల్పోతున్నట్లు భావిస్తున్నారు.

ఒత్తిడి జయిస్తోంది కొంతమందే

ఒత్తిడికి గురవుతున్న 88.43 శాతం మందిలో... చక్కగా ప్రణాళిక రూపొందించుకుని, దానిని సమర్థవంతంగా అమలుచేస్తున్నామని చెప్పిన వారి శాతం కేవలం 7.54 శాతం మాత్రమే.

జయించాలిలా

'ఐటీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు జరుగుతున్న వేగవంతమైన మార్పులతో ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఆయా సంస్థలు తమ ఉద్యోగులను ఒత్తిడి నుంచి దూరంచేసేలా ఉపశమన చర్యలు చేపట్టాలి. అప్పుడే ఈ పోటీవాతావరణంలో ఆయా ఉద్యోగ బృందాలు, కంపెనీలు విజయవంతంగా ముందుకు సాగగలుగుతాయి.' అని ఎస్​సీఐకేఈవై సహవ్యవస్థాపకుడు శ్రీరామ్ విశ్వనాథన్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: వృద్ధిరేటు అంచనాలు మరోసారి తగ్గించిన మూడీస్​

Last Updated : Feb 29, 2020, 6:34 AM IST

ABOUT THE AUTHOR

...view details