తెలంగాణ

telangana

ETV Bharat / business

ఒపెక్ ప్రత్యేక సమావేశం వాయిదా.. కారణమేంటి? - Azerbaijan energy ministry

ఒపెక్​, ఇతర చమురు ఉత్పత్తి దేశాల మధ్య సోమవారం జరగాల్సిన కీలక సమావేశం వాయిదా పడింది. ఈ నెల 9 వరకు ఈ భేటీ వాయిదా పడినట్లు సమాచారం. అయితే దీనిపై ఒపెక్​ అధికారిక ప్రకటన చేయలేదు.

OPEC meeting postponed until Thursday: Azerbaijan
ఒపెక్ ప్రత్యేక సమావేశం వాయిదా.. కారణమేంటి?

By

Published : Apr 5, 2020, 7:10 AM IST

​ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌ (ఒపెక్‌), రష్యా సహా ఇతర ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల మధ్య జరగాల్సిన ప్రత్యేక సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ప్రధాన చమురు ఉత్పత్తి దేశల్లో ఒకటైన అజర్​బైజాన్​ ప్రతినిధి జమినా అలీయేవా తెలిపారు.

ఏప్రిల్​ 9 వరకు ఈ భేటీ వాయిదా పడినట్లు సమాచారం. అయితే దీనిపై ఒపెక్​ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ వారం చివరిలో జరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు తెలిపాయి.

కారణమేంటి!

ఈ సమావేశం మొదట వీడియో కాన్ఫిరెన్స్​ ద్వారా సోమవారం జరగాల్సి ఉంది. చమురు విపణిని స్థిరీకరించడానికి ఒపెక్​, ఇతర చమురు ఉత్పత్తి దేశాల మధ్య అత్యవసర భేటీకి సౌదీ అరేబియా పిలుపునిచ్చింది.

కరోనా కారణంగా...

మహమ్మారి కరోనావైరస్​ కారణంగా దశాబ్ద కాలంలో ఎన్నడు లేని విధంగా చమురు ధరలు పతనమైపోయాయి. ఈ నేపథ్యంలో గత నెలలో రష్యా, ఒపెక్, దాని మిత్ర దేశాలు చమురు ఉత్పత్తి కోతపై ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించాయి. అయితే ఈ ప్రయత్నం విఫలమైంది.

ఉమ్మడి ప్రయత్నాలు...

రష్యా రోజుకు 10 మిలియన్​ బారెల్స్​ ఉత్పత్తి తగ్గించడంపై చర్చించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది. "మార్కెట్‌ను సమతుల్యం చేయడానికి, ఉత్పత్తిని తగ్గించడానికి సమష్టి ప్రయత్నాలు అవసరమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ అన్నారు.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ వేళ ప్రజలు ఇంత ఆరోగ్యంగా తయారయ్యారా?

ABOUT THE AUTHOR

...view details