తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.20 లక్షల విత్‌డ్రాకే అనుమతి

నల్ల ధనాన్ని కట్టడి చేయడానికి ఆదాయ పన్ను(ఐటీ) విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలు దాఖలు చేసే ఆదాయ పన్ను రిటర్నుల పరిస్థితిని వాణిజ్య బ్యాంకులు తనిఖీ చేసుకునే వెసులుబాటును ఐటీ విభాగం ఆవిష్కరించింది. నగదు విత్​డ్రా పరిమితిని సైతం రూ. 20 లక్షలకే పరిమితం చేసింది.

Only Rs 20 lakh withdrawal allowed
రూ.20 లక్షల విత్‌డ్రాకే అనుమతి

By

Published : Sep 3, 2020, 9:05 AM IST

కంపెనీలు దాఖలు చేసే ఆదాయ పన్ను రిటర్నుల పరిస్థితిని వాణిజ్య బ్యాంకులు తనిఖీ చేసుకునే వెసులుబాటును ఆదాయ పన్ను(ఐటీ) విభాగం ఆవిష్కరించింది. సంస్థల శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌) ద్వారా ఆ వివరాలు పొందొచ్చు. ఎపుడూ ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయని వారు కూడా భారీ మొత్తంలో నగదును విత్‌డ్రా చేసుకుంటున్నట్లు వచ్చిన గణాంకాల నేపథ్యంలో నల్ల ధనాన్ని కట్టడి చేయడానికి ఐటీ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది.

అంతే కాకుండా.. ఆర్థిక చట్టం 2020, సవరించిన ఐటీ చట్టం- 1961 ప్రకారం.. చేయని వ్యక్తుల నగదు విత్‌డ్రా పరిమితిని సైతం రూ.20 లక్షలకే పరిమితం చేసింది. అదే సమయంలో ఫైలింగ్‌ చేయని వ్యక్తులు రూ.కోటి కంటే ఎక్కువ నగదు ఉపసంహరణలు చేస్తే 5 శాతం టీడీఎస్‌(మూలం వద్ద పన్ను మినహాయింపు)ను విధించనున్నట్లూ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details