తెలంగాణ

telangana

ETV Bharat / business

One moto India: రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన బ్రిటన్‌ సంస్థ 'వన్​ మోటో' - బ్రిటన్‌ సంస్థ వన్ మోటో

One moto India: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటన్‌ సంస్థ వన్ మోటో ముందుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. జహీరాబాద్‌లో రూ.250 కోట్లతో తయారీ యూనిట్‌ను ఏడాదిలోగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

One moto India: రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన బ్రిటన్‌ సంస్థ 'వన్​ మోటో'
One moto India: రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చిన బ్రిటన్‌ సంస్థ 'వన్​ మోటో'

By

Published : Jan 3, 2022, 7:36 PM IST

One moto India: బ్రిటీష్ ఆటోమొబైల్ కంపెనీ వన్ మోటో తెలంగాణలో 250 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఈ తయారీ యూనిట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, 2వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో వన్ మోటోకు చెందిన కమ్యూటా, బైకా, ఎలక్ట్రా వంటి మూడు మోడళ్లను పరిశ్రమల శాఖా ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ఆవిష్కరించారు.

ప్రీమియం ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలను ఆఫర్ చేస్తోన్న వన్ మోటో మోడళ్లు.. లక్షా 20 వేల ప్రారంభం ధర నుంచి 2 లక్షల రేంజ్​లో లభిస్తాయని వన్ మోటో ఇండియా ప్రమోటర్ ముజమిల్ రియాజ్ తెలిపారు. 80 కి.మీల రేంజ్ నుంచి 180 కి.మీల రేంజ్ మైలేజ్​ను ఇచ్చే వన్ మోటో బైకుల గరిష్ట వేగం 100 కి.మీలుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కంపెనీ తరఫున సొంతంగా స్వాపింగ్ స్టేషన్లు, రోడ్ సైడ్ అసిస్టెన్స్ కోసం 6 వేల టచ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి మొదటివారంలో గచ్చిబౌలిలో మొదటి ఎక్స్​పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసి, తాము నూతనంగా నెలకొల్పే తయారీ యూనిట్ ద్వారా వచ్చే ఏడాదికల్లా ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించారు.

ఇండియాలో ఇప్పటివరకు మూడు బైకులను లాంచ్​ చేశాం. కమ్యూటా అనే ఎంట్రీ లెవెల్​ బైక్​ ఉంది. బైకా అనే ప్రీమియం సెగ్మెంట్​ బైక్​ ఉంది. ఎలక్ట్రా అనే హైలెవెల్​ ప్రీమియం సెగ్మెంట్​ ఉంది. కమ్యూటా బేసిక్​ బైక్​కు రూ.లక్షా 30వేల ధర ఉంది. బైకా మోడల్​కు రూ.లక్షా 90వేల ధర ఉంది. ఎలక్ట్రా మోడల్​కు రూ.లక్షా 99వేల ధర ఉంది. ఈ మూడు ద్విచక్రవాహనాలను ఇక్కడ లాంచ్​ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా సహకారం అందిస్తోంది. తెలంగాణలో రూ.250 కోట్లతో తయారీ యూనిట్​ను కూడా ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంటాం. -ముజమిల్ రియాజ్, వన్ మోటో ఇండియా ప్రమోటర్

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details