నిన్న మొన్నటి వరకు ఉల్లి ధరలు సగటు వినియోగదారుడ్ని బెంబేలెత్తించాయి. ఇప్పుడు అదే దారిలో టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో బుధవారం కిలో టమాట రూ. 80 వరకు పలికింది.
టమాట సాగు చేసే కర్ణాటక వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలతో దిగుబడి, సరఫరా తగ్గిపోవటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు వ్యాపారులు.
ప్రభుత్వం ప్రకారం...
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దిల్లీలో టమాట సరాసరి రిటైల్ అమ్మకం ధర రూ.54గా ఉంది. అక్టోబర్ 1న అది రూ.45గా ఉండేది. దిల్లీతో పాటు ఇతర మెట్రో నగరాల్లోనూ టమాట ధర భారీగా పెరిగింది. కోల్కతాలో రూ.60, ముంబయిలో రూ.54, చెన్నైలో రూ.40గా ఉంది.
దిగొచ్చిన ఉల్లి..
కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించటం, సరఫరా పెరగటం వల్ల ఉల్లి ధరలు గతవారంతో పోలిస్తే కాస్త దిగొచ్చాయి. ప్రస్తుతం దిల్లీలో కిలో ఉల్లి ధర రూ.60 వరకు పలుకుతోంది.
ఇదీ చూడండి: మోదీ-జిన్పింగ్ భేటీ మామల్లపురంలోనే ఎందుకు?