హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. సముద్రమట్టానికి 10వేల అడుగుల ఎత్తులో 9.2 కిలోమీటర్ల మేర ఉన్న ఈ సొరంగ మార్గం నిర్మాణంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్‌ఓ) కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా.. బీఆర్‌ఓను ప్రత్యేకంగా అభినందించారు. అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని సొరంగ నిర్మాణం పూర్తిచేసిన సరిహద్దు రహదారుల సంస్థకు భారత రత్న ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
'సంస్థలకు భారతరత్న పురస్కారం ఇవ్వొచ్చో లేదో కచ్చితంగా తెలియదు గానీ.. వీరత్వం, కఠినశ్రమతో పనిచేసే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాత్రం ఇందుకు అర్హమైనది. ఇక బీఆర్‌ఓను భారతరత్న ఆర్గనైజేషన్ అనాలి'