తెలంగాణ

telangana

By

Published : Mar 15, 2021, 6:22 PM IST

ETV Bharat / business

'జీఎస్​టీ పరిధిలోకి పెట్రోల్.. ఆ​ ప్రతిపాదనే లేదు'

ఇంధన ధరలకు కళ్లెం వేసేలా పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చన్న వార్తలను మరోసారి కేంద్రం తోసిపుచ్చింది. పెట్రోల్, డీజిల్, జెట్‌ ఇంధనం, సహజ వాయువులను వస్తుసేవల పన్ను పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనేదీ ప్రస్తుతం తమ వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లోక్‌సభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

No proposal to bring petrol, diesel, ATF, gas under GST: FM Sitharaman
'పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదన లేదు'

పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవా పన్ను(జీఎస్‌టీ)లోకి తెచ్చే విషయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం, గ్యాస్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్రం స్పష్టం చేసింది. వీటిపై జీఎస్‌టీ కౌన్సిల్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన చేయలేదని లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చింది. పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవల పన్నులోకి తెచ్చే అంశాన్ని జీఎస్‌టీ కౌన్సిల్‌ సరైన సమయంలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో.. ధరలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులను తగ్గించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అదే సమయంలో రాష్ట్రాలు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్సైజ్‌, వ్యాట్‌ తగ్గింపు విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పరస్పరం ఆలోచన చేయాల్సి ఉందని అనురాగ్‌ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. గతేడాది మార్చి నెలలో క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 19డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది 65డాలర్లకు పెరిగిందని అనురాగ్‌ ఠాకూర్‌ గుర్తుచేశారు.

రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించేందుకు వీటిని జీఎస్‌టీలోకి తీసుకురావాలనే డిమాండ్‌ గత కొంతకాలంగా ఎక్కువైంది. ఇంధన ధరలను జీఎస్‌టీలోకి తీసుకురావడం వల్ల ధరలను తగ్గించవచ్చని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌లు గతంలో అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: 'జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్'పై కేంద్రం స్పష్టత

ABOUT THE AUTHOR

...view details