ఆత్మనిర్భర భారత్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను రెండో రోజూ విశదీకరించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇందులో భాగంగా రైతులు, వలస కార్మికులు, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులపై ప్రధానంగా దృష్టి సారించారు.
ముద్ర శిశు రుణాలు
ముద్రా ముద్రా యోజన కింద శిశు రుణాలు తీసుకున్నవారికి వడ్డీ రేట్లలో సబ్సిడీ ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 3 నెలల మారటోరియం తర్వాత 12 నెలల పాటు 2శాతం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్(వడ్డీరేట్లలో సబ్సిడీ) సౌలభ్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. దీని ద్వారా 3 కోట్ల మందికిపైగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఈ సబ్సిడీ ద్వారా రూ.1500 కోట్లు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు.