టాటా నానో కారు భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జనవరిలో వాటి ఉత్పత్తితో సహా విక్రయాలు శూన్యంగా మిగిలాయి. ప్రజల కారుగా పిలిచే నానో ఉత్పత్తిని ఏప్రిల్ 2020 నుంచి ఆపేయనున్నట్లు టాటా మోటార్స్ సంకేతాలు ఇచ్చింది. బీఎస్-4 ఉద్గారాలతో పాటు భద్రత నిబంధనలే దీనికి కారణమని తెలిపింది.
నానో కారుకు టాటా? - కారు
రతన్ టాటా కలల కారు నానో. అత్యంత చౌకైన ఈ కారు ఉత్పత్తి నిలిచిపోనుందా? అంటే అవుననే అంటున్నాయి టాటా మోటార్స్ వర్గాలు.
నానో కారు విక్రయాలు, ఉత్పత్తి శూన్యం
గత సంవత్సరం జనవరిలో 83 కార్లను మాత్రమే ఉత్పత్తి చేయగా.. 62 కార్లు అమ్ముడుపోయాయి. 2019 జవవరితో పాటు క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతుల సంఖ్య సున్నాను చేరాయి.
2018 జూన్లో ఒక నానోను మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇదే నెలలో మూడు కార్లు అమ్ముడయ్యాయి. అయినప్పటికీ వీటి ఉత్పత్తిని కంపెనీ నిలిపివేయలేదు. కారు భవితవ్యంపై నిర్ణయం తీసుకోలేదని చెబుతూ వచ్చింది టాటా మోటార్స్.
Last Updated : Feb 6, 2019, 8:26 AM IST