తెలంగాణ

telangana

ETV Bharat / business

'దివాలా'తో సొంతగూటికి థామస్​కుక్​ కస్టమర్లు! - ఆపరేషన్​ మాటర్న్​హార్న్​

థామస్​కుక్​ సంస్థ దివాలా తీసిన తరువాత.. విదేశాల్లో చిక్కుకున్న తమ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియను బ్రిటన్ వేగవంతం చేసింది. ఆపరేషన్​ మాటర్​హార్న్ మొదలుపెట్టిన పౌర విమానయాన సంస్థ.. ఇప్పటికే 76 వేల మందిని బ్రిటన్​కు రప్పించామని ప్రకటించింది. ఈ ఆపరేషన్​ అక్టోబర్ ​6 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఆపరేషన్​ మాటర్న్​హార్న్​: సొంతగూటికి థామస్​కుక్​ కస్టమర్లు!

By

Published : Sep 28, 2019, 6:41 PM IST

Updated : Oct 2, 2019, 9:12 AM IST

ట్రావెల్​ సంస్థ థామస్ కుక్​ దివాలా ప్రకటించిన తరువాత... విదేశాల్లో చిక్కుకున్న 1,50,000 మంది విహారయాత్రికుల్లో సగానికి పైగా స్వదేశం బ్రిటన్​కు చేరుకున్నారని ఆ దేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ (సీఏఏ) తెలిపింది.

"ఆపరేషన్​ మాటర్​హార్న్​ ద్వారా మొదటి 5 రోజుల్లో... 76 వేల మంది యాత్రికులు స్వదేశం బ్రిటన్​కు చేరుకున్నారు. యుద్ధాలు లేని శాంతి సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో మనుషులను తరలించడం ఇదే మొదటిసారి."

- బ్రిటన్​ పౌరవిమాన నియంత్రణ సంస్థ (సీఏఏ)

పోటీ తట్టుకోలేక..

ఘనచరిత్ర కలిగిన ట్రావెల్ కంపెనీ థామస్​కుక్​... ఆన్​లైన్​ పోటీని తట్టుకోలేకపోయింది. కొన్ని వినాశకరమైన విలీనాలు, అధిక వ్యయం, రుణ భారం కంపెనీకి గుదిబండగా మారాయి. అయితే తన పతనానికి బ్రెగ్జిట్ అనిశ్చితే కారణమని ఆ సంస్థ ఆరోపించింది. చివరకు తమ వ్యాపారం నిలబెట్టుకొనేందుకు కావాల్సిన నిధులు సమీకరించలేక దివాలా ప్రకటించింది.

95 శాతం మంది...

విహారయాత్రకు వెళ్లినవాళ్లలో 95 శాతం మంది.. వాస్తవంగా వారి టూర్ ప్లాన్​లో ఏ రోజు తిరిగి ఇళ్లకు వద్దామనుకున్నారో.. అదే రోజున తిరిగి వస్తారని సీఏఏ తెలిపింది. థామస్​కుక్​ కస్టమర్లకు ఆతిథ్యం ఇచ్చే హోటళ్లకు చెల్లింపులు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

శనివారం 76 విమానాలు కేటాయించామని, ఇవి 16,700 మందిని స్వదేశానికి తీసుకొస్తాయని సీఏఏ పేర్కొంది.

ప్రస్తుతం చేపట్టిన ఈ ఆపరేషన్​ మాటర్​హార్న్​ అక్టోబర్​ 6 వరకు కొనసాగుతుందని, ఇందుకోసం 1000 విమానాలను సిద్ధంగా ఉంచామని సీఏఏ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:'భారతీయుల తరఫున మాట్లాడే అర్హత పాక్​కు లేదు'

Last Updated : Oct 2, 2019, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details