దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇళ్ల రేట్లు ఆకాశాన్ని తాకుతాయన్నది తెలిసిన విషయమే. అయితే కరోనా వైరస్ సంక్షోభంలో అక్కడ ఇళ్ల ధరలు తగ్గుతాయనుకుంటే మాత్రం పొరబడినట్టే. ముంబయిలోని ఓ ఫ్లాట్‌ను ఇటీవలే ఓ పారిశ్రామికవేత్త కొనుగోలు చేశారు. దాని విలువ అక్షరాలా రూ. 136కోట్ల 27లక్షలు.
రూ.8కోట్ల నగదు..
భారత్‌లోనే అతిపెద్ద స్టెయిన్లెస్ స్టీల్ తయారీదారుల్లో ఒకటైన విరాజ్ ప్రొఫైల్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ నీరజ్ కొచర్. నీరజ్ కొచర్, కనికా ధ్రువ్ కొచర్లు ముంబయిలోని లోయర్ పరేల్‌లో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. దీని ఖరీదు రూ. 136కోట్ల 27లక్షలు.
ఈ ఏడాదిలో ఒక ఫ్లాట్‌కు వెచ్చించిన ధరల్లో ఇదే అత్యధికం. కరోనా సంక్షోభంతో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగానికి ఇది కచ్చితంగా ఈ వార్త ఉత్తేజాన్ని అందిస్తుంది.