తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్​ బ్యాంకుపై మార్చి 18న మారటోరియం ఎత్తివేత

ఆర్​బీఐ రూపొందించిన ఎస్​బ్యాంకు పునరుద్ధరణ పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. గెజిట్​ ప్రకారం మార్చి 13 నుంచి అమల్లోకి వచ్చింది. మరో 3 పనిదినాల తర్వాత బ్యాంకుపై మారటోరియాన్ని ఎత్తివేస్తారు.

yes bank
ఎస్ బ్యాంకు

By

Published : Mar 14, 2020, 10:30 AM IST

ఎస్​ బ్యాంకుపై మారటోరియాన్ని మార్చి 18న ఎత్తివేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు సంక్షోభంలో ఎస్​ బ్యాంకు కోసం ఆర్​బీఐ రూపొందించిన పునరుద్ధరణ పథకాన్ని కేంద్రం నోటిఫై చేసింది.

ఆర్​బీఐ రూపొందించిన ఎస్​ బ్యాంకు పునరుద్ధరణ పథకం-2020 మార్చి 13 నుంచి అమల్లోకి వచ్చిందని గెజిట్​ నోటిఫికేషన్​లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అనంతరం 3 పని దినాల తర్వాత మార్చి 18న మారటోరియం ఎత్తివేస్తారు.

ఎండీ, సీఈఓ నియామకం..

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్​ బ్యాంకు పాలనాధికారిగా ఉన్న ప్రశాంత్ కుమార్​ను.. పునరుద్ధరించిన బోర్డుకు మేనేజింగ్ డైరెక్టర్​, సీఈఓగా నియమించింది.

ఎస్‌ బ్యాంకుపై మారటోరియం విధిస్తూ మార్చి 5 రాత్రి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు జారీ చేసింది. ఖాతాదార్లకు నెలకు రూ.50 వేల ఉపసంహరణకు వీలుంటుందని తెలిపింది. అదే సమయంలో ఎస్‌ బ్యాంకు బోర్డును రద్దు చేసింది.

ఇదీ చూడండి:ఎస్​ బ్యాంకు రానా కపూర్​పై మరో సీబీఐ కేసు

ABOUT THE AUTHOR

...view details