తెలంగాణ

telangana

ETV Bharat / business

మాల్యా షేర్ల విక్రయంతో రూ.1,008 కోట్లు

విజయ్​ మాల్యాకు చెందిన సమారు 7 లక్షల యూబీహెచ్​ఎల్​ షేర్ల విక్రయం ద్వారా రుణ రికవరీ ట్రైబ్యునల్​ రూ.1,008 కోట్లు పొందింది. రానున్న రోజుల్లో మరిన్ని అమ్మకాలు ఉంటాయని ఈడీ పేర్కొంది.

By

Published : Mar 28, 2019, 6:59 AM IST

మాల్యా

మాల్యా షేర్లు విక్రయం
వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్​కు పరారైన విజయ్​ మాల్యా ఆస్తులు స్వాధీనం చేసుకునే పక్రియను వేగవంతం చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. యునైటెడ్​ బ్రూవరీస్​ హోల్డింగ్స్​లో మాల్యాకు చెందిన 74 లక్షల షేర్లను విక్రయించటం ద్వారా రుణ రికవరీ ట్రైబ్యునల్​(డీఆర్​టీ) రూ.1,008 కోట్ల రూపాయలు పొందిందని ఈడీ తెలిపింది.

హవాలా కేసుకు సంబంధించి ఈ షేర్లు అటాచ్​ చేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ వాటాలను రుణ రికవరీ ట్రైబ్యునల్​కు అప్పగించాలని గతంలో యస్​ బ్యాంకును కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 74,04,932 వాటాల అమ్మకాలకు రుణ రికవరీ ట్రైబ్యునల్​ ప్రకటన విడుదల చేసింది.

మాల్యా కేసులో షేర్ల విక్రయం ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో మరిన్ని అమ్మకాలు ఉంటాయని ఈడీ అధికారులు తెలిపారు. యస్​ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు హామీగా మాల్యా యూబీహెచ్​ఎల్​ షేర్లను అమ్మకానికి పెట్టారు. అయితే యస్​ బ్యాంకు ఇచ్చిన రుణంలో అధికం భాగం చెల్లింపులే ఉన్నాయి. దీంతో షేర్ల అమ్మకాలకు మార్గం సుగమమైంది.

ABOUT THE AUTHOR

...view details