తెలంగాణ

telangana

ETV Bharat / business

'కృతిమ మేధ ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్తున్నాం' - ktr launch the Year of AI logo and the website

కృత్రిమ మేధను ప్రజలకు ఉపయోగపడేలా ముందుకు తీసుకెళ్తున్నామని ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏఐతో పింఛన్లు, రైతులకు సాయపడే చర్యలు తీసుకున్నామని వివరించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణాస్‌ ఇయర్‌ ఆప్‌ ఏఐ లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.

ktr
ktr

By

Published : Jan 2, 2020, 1:51 PM IST

Updated : Jan 2, 2020, 3:04 PM IST

ఈ ఏడాదిని రాష్ట్రం కృత్రిమ మేధ సంవత్సరంగా జరుపుకుంటుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణాస్‌ ఇయర్‌ ఆప్‌ ఏఐ లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. సాంకేతికత ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని సీఎం కేసీఆర్ చెబుతుంటారని కేటీఆర్ తెలిపారు. కృత్రిమ మేధను ప్రజలకు ఉపయోగపడేలా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

కృతిమ మేధలో ప్రముఖ సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్‌ ఏఐ' ఏర్పాటు కోసం ఐఐటీ ఖరగ్‌పూర్‌తోనూ సర్కారు ఒప్పందం చేసుకుంది. రిజిస్ట్రేషన్ శాఖతో పాటు పోలీస్ శాఖలో పైలట్ ప్రాజెక్టులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మౌలిక సదుపాయాలు, స్ట్రాటజీ భాగస్వామిగా ఐఐటీ హైదరాబాద్‌ వ్యవహరిస్తుందని కేటీఆర్​ వెల్లడించారు.

'కృతిమ మేధాను ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్తున్నాం'

ఇదీ చూడండి: 'మా' లో మళ్లీ విభేదాలు.. రాజశేఖర్​ 'చిరు' గొడవ!

Last Updated : Jan 2, 2020, 3:04 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details