తెలంగాణ

telangana

ETV Bharat / business

మైక్రోసాఫ్ట్​ ఛైర్మన్​గా సత్య నాదెళ్ల - Microsoft CEO

తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల మరో మెట్టు ఎక్కారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్​ సీఈఓగా ఉన్న ఆయనకు.. కంపెనీ ఛైర్మన్​గా అదనపు బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం.

Microsoft names India-born CEO Satya Nadella
సత్య నాదెళ్ల

By

Published : Jun 17, 2021, 9:55 AM IST

Updated : Jun 17, 2021, 11:08 AM IST

టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​ ఛైర్మన్​గా తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. ఇప్పటికే కంపెనీ సీఈఓగా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. బోర్డు ఛైర్మన్​ పదవికి స్వతంత్ర డైరెక్టర్లు.. బుధవారం నాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్​ కార్పొరేషన్​ ప్రకటించింది.

ఛైర్మన్​గా ఆయన.. మైక్రోసాఫ్ట్​లో వ్యూహాత్మక పాత్ర పోషించనున్నారు. బోర్డు సమీక్షలు సహా విధివిధానాలను నిర్ణయించనున్నారు.

ఇప్పటివరకు ఛైర్మన్​గా ఉన్న.. జాన్​ డబ్ల్యూ థామ్సన్​ ఇకపై ప్రధాన స్వతంత్ర డైరెక్టర్​గా నియమించారు. ఆయన 2012-14 మధ్య ఇదే బాధ్యతల్లో కొనసాగారు.

డివిడెండ్​.

ఆయా కీలక పదవుల్లో మార్పులు చేయడమే కాక.. మైక్రోసాఫ్ట్​ షేర్లకు త్రైమాసిక డివిడెండ్​ ప్రకటించింది. ఒక్కో షేరుకు 0.56 డాలర్లుగా నిర్ణయించింది.

2014 నుంచి మైక్రోసాఫ్ట్​ సీఈఓగా పనిచేస్తున్నారు నాదెళ్ల. సుదీర్ఘ కాలం ఆ విధులు నిర్వర్తించిన స్టీవ్​ బామర్​ స్థానంలో.. నాదెళ్లను ఎంపికయ్యారు. అప్పట్లో ఒక భారతీయుడికి, అదీ తెలుగువారికి ఆ అవకాశం లభించడం గర్వించదగ్గ విషయం. అంతకుముందు ఆయన.. మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

సత్య నాదెళ్ల హైదరాబాద్​లోనే జన్మించారు. వీరి తల్లిదండ్రులది అనంతపురం. నాదెళ్ల తండ్రి యుగంధర్​.. కేంద్ర ప్రణాళిక సంఘంలో సభ్యునిగా, ప్రధాన మంత్రి కార్యదర్శిగానూ పనిచేశారు.

అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు భారతీయుల సారథ్యం..

సత్య నాదెళ్ల సహా పలువురు భారత సంతతి వ్యక్తులు.. అంతర్జాతీయంగా ఎన్నో టెక్​ దిగ్గజ సంస్థలకు సారథ్యం వహిస్తున్నారు.

  • భారత సంతతి వ్యక్తి సుందర్​ పిచాయ్​ గూగుల్​ మాతృసంస్థ ఆల్ఫాబెట్​ సీఈఓగా ఉన్నారు.
  • అజయ్​ బంగ- మాస్టర్​కార్డ్​ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​
  • శంతనూ నారాయణ్​- అడోబ్​ సిస్టమ్స్​ సీఈఓ
  • అర్వింద్​ కృష్ణ- ఐబీఎం ఛైర్మన్​, సీఈఓ

ఇదీ చూడండి: భారత్​కు అండగా ఉంటామని పిచాయ్​, నాదెళ్ల హామీ

Last Updated : Jun 17, 2021, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details