కరోనా సంక్షోభంలో వ్యాపార నిర్వహణను సజావుగా కొనసాగించడంలో అనేక సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న, మధ్య తరహా వ్యాపారాలను(ఎస్ఎంబీలు) దృష్టిలో ఉంచుకుని 'బ్యాక్2బిజినెస్ సొల్యూషన్ బాక్సెస్' క్లౌడ్ సేవలను ప్రారంభించింది ప్రఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్.
వ్యాపార సంస్థల పరిమాణం ఆధారంగా వీటిని నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్లోని ఎస్ఎంబీలు ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకలాపాలను కొనసాసాగించే విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, రిమోట్ వర్క్ సొల్యూషన్, అధునాతన భద్రత, పరికరాల నిర్వహణ, వంటి సదుపాయాలతో వ్యాపార కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించేందుకు వీటిని రూపొందించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది మైక్రోసాఫ్ట్. వీటితో కార్యాలయాలపై నిర్వహణ భారం తగ్గడమే కాక, ఉద్యోగుల ఉత్పాదకత, వినియోగదారులతో సంబంధాలు మెరుగుపడతాయని పేర్కొంది. అజ్యూర్, అధునాతన యాప్ల ద్వారా సంస్థలు క్లౌడ్ సేవలను వినియోగించుకోవడం సులభతరమవుతుందని స్పష్టం చేసింది.
నాలుగు వేరియంట్లలో
స్టార్టర్:చిన్న వ్యాపార సంస్థలను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు. రిమోట్ వర్కింగ్, సురక్షిత వాతావరణం, సహకర పరిష్కారం అవసరమయ్యే సంస్థలకు ఉది ఉపయోగకరం.