ఎస్యూవీ వెటారా బ్రేజా సరికొత్త మైలురాయిని అందుకుంది. మార్కెట్లోకి విడుదలైన నాలుగేళ్లల్లోపే 5 లక్షలకు పైగా కాంపాక్ట్ ఎస్యూవీ కార్లు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ ఇండియా(ఎమ్ఎస్ఐ) మంగళవారం ప్రకటించింది.
బ్రేజాకు భారతీయులు ఫిదా.. 5 లక్షల విక్రయాలు! - వెటారా బ్రేజా 5 లక్షల విక్రయాలు
వెటారా బ్రేజా 5 లక్షల విక్రయ మార్కును అందుకుందని మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించింది. కాంపాక్ట్ ఎస్యూవీ అమ్మకాల్లో ఇదొక రికార్డని పేర్కొంది.
బ్రేజాకు భారతీయులు ఫిదా.. 5 లక్షల విక్రయాలు!
"వెటారా బ్రేజాను సుజికీ కోర్ టెక్నాలజీని ఉపయోగించి రూపొందించాం. భారతీయ వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 47 నెలల్లోనే లక్షల కార్లు అమ్ముడుపోవడం ఎస్యూవీ పట్ల వినియోగదారులకు ఉన్న ప్రాధాన్యతకు సాక్ష్యం."
--- శశాంక్ శ్రీవాత్సవ, ఎమ్ఎస్ఐ ఎక్జిక్యూటివ్ డైరక్టర్
ఈ మోడల్‌ను తొలిసారి 2016లో ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో అత్యంత వేగంగా 5 లక్షల విక్రయ మార్కును వెటారా బ్రేజా అందుకుందని ఎమ్ఎస్ఐ పేర్కొంది.