కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ఈసారి కొన్ని కొత్త పథకాలను ప్రకటించింది మోదీ సర్కార్. నేషనల్ హెల్త్ మిషన్‌కు అదనంగా పీఎం ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన సహా.. కోట్లాది మందికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు జల్‌జీవన్ మిషన్ పథకాలను ప్రారంభించింది. వాటి గురించి తెలుసుకుందాం.
పీఎం ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజన
కేంద్రం నిర్వహించే ఈ పథకం కోసం రూ.64,180 కోట్లను కేటాయించింది. నేషనల్ హెల్త్ మిషన్‌కు అదనంగా దీనిని ఏర్పాటుచేసింది. 17వేల గ్రామీణ, 11వేల పట్టణ ఆరోగ్య కేంద్రాలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ స్కీం ఏర్పాటు చేశారు. అన్నిజిల్లాలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌ల ఏర్పాటు. 9 బయోసేఫ్టీ లెవల్-3 ల్యాబ్‌ల ఏర్పాటు వంటివి ఉన్నాయి.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌ను బలోపేతం చేసేలా 12 సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ల ఏర్పాటు. దీంతోపాటు ఐదు స్థానిక బ్రాంచిలు.. మెట్రోపాలిటిన్ హెల్త్ సర్వైలైన్స్ సెంటర్ల ఏర్పాటు వంటి చేపట్టనున్నారు.
మిషన్ పోషణ్ 2.0
పోషక పదార్థాలను అవసరమైన వారికి అందేట్లు చేయడం. దీంతోపాటు ది సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం, పోషణ్ అభియాన్‌ను విలీనం చేయడం. 112 జిల్లాల్లో పోషక లోపాలను సరిచేసేలా చూడటం.