తెలంగాణ

telangana

ETV Bharat / business

చిటికెలో మీ పాన్​ కార్డుకు ఆధార్​ని అనుసంధానించండి

పాన్​ కార్డుకి ఆధార్​ కార్డు అనుసంధాన పక్రియకు గడువు ఈ నెల 31తో ముగియనుంది. అనుసంధాన పక్రియకు ఇప్పటికే ఐదు సార్లు గడువు పెంచింది ఆదాయపు పన్ను శాఖ. ఈసారి గడువు పెంచే అవకాశాలు చాలా తక్కువ.

పాన్ కు ఆధార్​ అనుసంధానం

By

Published : Mar 22, 2019, 6:30 AM IST

మీ పాన్​ కార్డుకు ఆధార్​ కార్డును అనుసంధానించారా..? చేయకపోతే వెంటనే ఆ పని కానివ్వండి. ఎందుకంటే పాన్​ కార్డుకు ఆధార్​ అనుసంధానం చేయడానికి ఈ నెల 31 చివరి తేది. అయితే ఏంటీ ఎప్పటిలానే మళ్లీ గడువు పెంచుతారు అనుకుంటున్నారా? ఇప్పటికే చాలా సార్లు కేంద్రం అనుసంధాన పక్రియకు గడువు పెంచింది. ఈసారి ఆ ఆవకాశం ఉండకపోవచ్చు.

పాన్​ కార్డుకు ఆధార్​ను అనుసంధానించడానికి 2018 జూన్​ 30న చివరి తేదీగా నిర్ణయించింది ఆదాయపుపన్ను శాఖ. కానీ దేశంలో చాలామంది ఆధార్​ నమోదు పక్రియకు ఇబ్బందులు ఎదురవుతుండటాన్ని గ్రహించి గడువును ఈ ఏడాది మార్చి 31కి పెంచింది. ఈ రెండు పత్రాల అనుసంధానానికి దాదాపు 5 సార్లు గడువు పెంచింది ఆదాయపు పన్ను శాఖ.

సులువుగా ఈ అనుసంధాన పక్రియను ఎలా పూర్తి చేయాలో ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఐటీఆర్​ వెబ్​సైట్​లో సులభంగా పూర్తి చేయవచ్చు:

ఐటీఆర్​ వెబ్​సైట్​లో లాగిన్​ అయి అక్కడ ఉన్న లింక్​ను​ క్లిక్​ చేసి పాన్​ కార్డుకు ఆధార్​ అనుసంధానించవచ్చు.
మొదట మీరు మీ ఆధార్​, పాన్​ కార్డును సిద్ధంగా ఉంచుకోండి.

⦁ ఆదాయపు పన్ను శాఖ వెబ్​సైట్​ "https://www.incometaxindiaefiling.gov.in/home" లో లాగిన్​ అవ్వండి . హోమ్​ పేజ్​లో మీకు ఎడమవైపు "క్విక్​ లింక్స్​" అనే బటన్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేయగానే చాలా అంశాలు వస్తాయి. అందులో "లింక్​ ఆధార్​" అనే ఆప్షన్​పై క్లిక్​ చేయండి.

⦁ లింక్​ ఆధార్​ బటన్​పై క్లిక్​ చేయగానే అది మిమ్మల్ని మరో పేజిలోకి తీసుకెళుతుంది. అందులో కచ్చితంగా పూర్తి చేయాల్సిన దరఖాస్తు ఫారం ఉంటుంది. అందులో మీ వివరాలను నమోదు చేయండి.

⦁ ఫారం పూర్తి చేయగానే మీ పాన్​ కార్డు నెంబర్​ని నింపమని అడుగుతుంది. దీని తరువాత ఆధార్​ నంబర్​ పూరించమని అడుగుతుంది. ఆ తర్వాత మీ పేరు అడుగుతుంది. చాలా మంది తప్పు చేసేది ఇక్కడే. ఎటువంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా ఆధార్​ కార్డులో మీ పేరు ఎలా ఉందో అలాగే నింపండి. మీరు పుట్టిన సంవత్సరం నింపండి.

⦁ పక్రియ దాదాపు చివరి అంకానికి వచ్చినట్లే మొత్తం పూర్తయిన తరువాత క్రింద భాగంలో లింక్​ ఆధార్​ అనే ఆప్షన్​ వస్తుంది. దానిపై క్లిక్​ చేస్తే అది మరో పేజ్​లోకి తీసుకెళ్తుంది. మీరు పన్ను చెల్లింపు దారు కింద రిజిష్టర్​ అయి ఉంటే ఈ-ఐటీఆర్​లోకి లాగిన్​ అయి నిర్ధారించమని అడుగుతుంది. మీరు పన్ను చెల్లింపు దారులు కానట్లయితే ​ మీరు విజయవంతంగా అనుసంధాన పక్రియ పూర్తి చేసినట్లు సందేశం వస్తుంది.

2. సందేశం ద్వారా చిటికెలో:

మీ మొబైల్​ నుంచి ఓ చిన్న సందేశాన్ని పంపంటం ద్వారా పాన్​ కార్డుకి ఆధార్​ అనుసంధాన పక్రియ పూర్తి చేయవచ్చు.

మీ మొబైల్​లో "UIDPAN" అని టైప్​ చేసి స్పేస్​ ఇచ్చి 12 అంకెల ఆధార్​ నెంబర్​ని టైప్​ చేయండి. మళ్లీ స్పేస్​ ఇచ్చి 10 అంకెల పాన్​ నెంబర్​ని టైప్​ చేసి 567678 లేదా 56161 నంబర్​కు కాని సందేశం పంపండి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు ఏ మొబైల్​ నెంబర్​ నుంచి సందేశం పంపిస్తున్నారో అది మీ ఆధార్​ కార్డుతో రిజిష్టర్​ అయి ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details