జీవిత బీమా కార్పొరేషన్(ఎల్‌ఐసీ)లో ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి వస్తే కొనుగోలు చేసి ఆదుకొనే ఎల్ఐసీనే అమ్మకానికి రావడం వెనక అనేక కారణాలున్నాయి.
ఎల్‌ఐసీ (జీవిత బీమా కార్పొరేషన్) వద్ద భారీగా నిరర్థక ఆస్తులు, తక్కువ రేటింగ్ పెట్టుబడులు పోగుబడుతున్నాయి. ఇటువంటివి దాదాపు రూ.67,387 కోట్లకు చేరాయి. ఈ లెక్కలను ఆ సంస్థే ప్రకటించింది. 2014 తర్వాత ఈ సంస్థ పెట్టుబడులు కూడా భారీగా పెరిగిపోయాయి. నిధుల కొరత ఉన్న ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల్లో వాటాలు కొని ఆదుకొంది. సెప్టెంబర్ త్రైమాసికానికి ఎల్‌ఐసీ రూ.30వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. అంతుకు ఆరునెలల ముందుతో పోలిస్తే ఇది రూ.5,000 కోట్లు ఎక్కువ. మార్చి త్రైమాసికంలో ఇవి రూ.24,777 కోట్లుగా ఉన్నాయి. 2015 మార్చి నుంచి సెప్టెంబర్ 2019 వరకు 145శాతం పెరిగాయి. ఇవి ప్రమాద ఘంటికలు మొగించినట్లే లెక్క. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలహీనమైన పెట్టుబడులు(డౌన్‌గ్రేడింగ్ ఇన్వెస్ట్‌మెంట్లు)రూ.23,126 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటికే రిలయన్ క్యాపిటల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, పీఎన్‌బీ హౌసింగ్, ఎస్సార్ పవర్, స్టెర్లింగ్ బయోటెక్, ఏబీజీ షిప్‌యార్డ్, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ వంటి పెద్ద సంస్థలు ఉన్నాయి. దీనికి తోడు ఎల్‌ఐసీ సాల్వెన్సీ రేషియో కూడా సెప్టెంబర్ 2019 నాటికి 1.55 నిష్పత్తికి చేరింది. ఇది పరిశ్రమలో అతితక్కువ.
భారీగా పెరిగిన పెట్టుబడులు
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్‌ఐసీ పెట్టుబడులు భారీగా 76శాతం పెరిగాయి. మార్చి 2019 నాటికి ఎల్‌ఐసీ రూ.26,61,564 కోట్లు పెట్టుబడులుగా పెట్టింది. 2014లో ఈ మొత్తం కేవలం రూ.15,11,133 కోట్లుగా ఉంది. మోదీ సర్కారు చేపట్టిన పెట్టుబడి ఉపసంహరణల్లో చాలా వాటిని ఇదే ఆదుకొంది. బీహెచ్‌ఈఎల్‌లో 5.94శాతం వాటా.. కోల్ ఇండియాలో రూ.7,000 కోట్లు.. 2017 జనవరిలో జీఐసీ, న్యూఇండియా ఎష్యూరెన్స్ కార్పొరేషన్‌లో రూ.15,000 కోట్లు, 2018లో ఐడీబీఐలో రూ.13,000 కోట్లు పెట్టి వాటాలు కొనుగోలు చేసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను కూడా కష్టాల నుంచి బయటపడేయమని ప్రభుత్వం కోరినా.. మోసపూరిత వ్యవహారాలు ఉండటంతో వెనుకడుగు వేసింది. ఏటా కనీసం రూ.55వేల కోట్ల వరకు మార్కెట్లలో ఎల్‌ఐసీ పెట్టుబడులు వస్తుంటాయి. ఎల్‌ఐసీకి రూ.4లక్షల కోట్లకు విలువైన డిబెంచర్లలో పెట్టుబడులు ఉన్నాయి. దీతోపాటు ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో రూ.3.7లక్షల కోట్ల వరకు మదుపు చేసింది.
దేశంలోనే భారీ కంపెనీగా అవతరణ..
ఎల్‌ఐసీ కనుక మార్కెట్లో లిస్ట్ అయితే దేశంలోనే భారీ కంపెనీగా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కంపెనీ ఆస్తులు.. పెట్టుబడుల లెక్క చూస్తే తేలిగ్గా ఇప్పుడున్న అన్ని టాప్ కంపెనీలను దాటేస్తుంది. ఈ కంపెనీ మొత్తం పెట్టుబడులే రూ.31.11 లక్షల కోట్లు. ఇక 2018 సంవత్సర లాభం రూ.48,436 కోట్లు. ఈ కంపెనీ మార్కెట్లలో లిస్ట్ అయితే కనుక భారీగా విలువ పెరగడం ఖాయం. ఒక్క వాటాల పెట్టుబడులపైనే రూ.25వేల కోట్లకు పైగా లాభం వచ్చింది. ఇంత విలువైన సంస్థను ఎల్‌ఐసీ యాక్ట్ 1956 ప్రకారం రూ.5కోట్ల నిర్వహణ మూలధనంతో ప్రారంభించారు.
"భారీగా నిర్వహణ ఆస్తులు ఉన్న కంపెనీ ఎల్‌ఐసీ... మూలధనం ప్రకారం భారత్ అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించే అవకాశం ఉంది. ప్రభుత్వ సంస్థ కావడం వల్ల ప్రైవేటు కంపెనీలతో పోలిస్తే వాల్యుయేషన్ గ్యాప్(కంపెనీ వాస్తవ విలువకు, అమ్మకం విలువకు మధ్య తేడా) కనిపిస్తుంది. కేవలం 25-30 శాతం ఆస్తులు దాదాపు 8-10 లక్షల కోట్లు విలువ చేసే అవకాశం ఉంది."
-కాజల్ గాంధీ, ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు
ఎంత శాతం వాటాల విక్రయం..