తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లోకి కియా తొలి ఎలక్ట్రిక్​ కారు- ధర, ఫీచర్లు ఇవే.. - కియా ఈవీ6 ఫీచర్లు

హ్యుందాయ్ మోటార్స్​​ అనుబంధ సంస్థ కియా తొలి, పూర్తి స్థాయి ఎలక్ట్రిక్​ కారును విడుదల చేసింది. ఇప్పటికే 38 వేలకుపైగా ప్రీ ఆర్డర్స్​ దక్కించుకున్న ఈ మోడల్ ప్రత్యేకతలు, ధర వంటి వివరాలు ఇలా ఉన్నాయి.

Kia EV6 price
కియా ఈవీ6 ధర

By

Published : Aug 2, 2021, 1:18 PM IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తొలి ఎలక్ట్రిక్​ కారును ఆవిష్కరించింది. ఈవీ6 పేరుతో.. దీనిని దక్షిణ కొరియా స్థానిక మార్కెట్లోకి విడుదల చేసింది. ఈవీ6ను ఈవీ-ఓన్లీ ఎలక్ట్రిక్​-గ్లోబల్ మాడ్యూల్​ ప్లాట్​ఫామ్​ (ఈ-జీఎంపీ)పై అభివృద్ధి చేసినట్లు తెలిపింది కియా.

కియా ఈవీ 6 లుక్​

ఈవీ6 ధరను 40,800 డాలర్ల నుంచి 49,500 డాలర్లుగా నిర్ణయించింది కంపెనీ. స్థానిక ప్రభుత్వం విద్యుత్​ వాహనాల కొనుగోలుకు అందిస్తున్న ప్రోత్సాహంతో.. ఈ కారును దాదాపు 35 వేల డాలర్లకే సొంతం చేసుకోవచ్చని కియా పేర్కొంది.

ఈవీ 6 వెనకపైపు లుక్​

ఈ ఏడాది చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లలోనూ ఈవీ6ను విడుదల చేయనున్నట్లు కియా గతంలోనే వెల్లడించింది.

బ్లూ కలర్ వేరియంట్

ప్రీ ఆర్డర్ల జోరు..

ఈవీ6 కోసం దక్షిణ కొరియాలో మొత్తం 30 వేలకు పైగా ప్రీఆర్డర్లు వచ్చినట్లు కియా తెలిపింది. ఐరోపా, అమెరికా మార్కెట్ల నుంచి 8,800 యూనిట్లకు ప్రీ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది.

ఈవీ6 ప్రత్యేకతలు..

  • ఈవీ6 రెండు రకాల బ్యాటరీ వేరియంట్లలో లభించనుంది.
  • ఫుల్​ ఛార్జ్​ చేసిన.. 58 కిలోవాట్​ స్టాండర్డ్​ అవర్ (కేడబ్ల్యూఎహ్​) బ్యాటరీ ద్వారా 370 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
  • 77.4 కిలోవాట్​ (కేడబ్ల్యూఎహ్​) బ్యాటరీని పూర్తిగా ఛార్జ్​ చేస్తే.. 475 కిలో మీటర్లు ప్రయాణించే వీలుంది.
  • 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు.. 4.5 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేసుకునేలా అల్ట్రా ఛార్జింగ్ సపోర్ట్​.
  • 3.5 సెకన్లలో 0-100 కిలో మీటర్ల వేగం అందుకునే సామర్థ్యం.

ఇదీ చదవండి:టాటా మోటార్స్‌ రూ.28,900 కోట్ల పెట్టుబడులు

ABOUT THE AUTHOR

...view details