తెలంగాణ

telangana

ETV Bharat / business

అబుదాబిలో రిలయన్స్‌ భారీ పెట్టుబడులు - అబుదాబిలో రిలయన్స్​ సంయుక్త సంస్థ

Reliance ta'ziz: అబుదాబి కెమికల్స్‌ డెరివేటివ్స్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్‌ (టాజిజ్‌)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) మంగళవారం వెల్లడించింది. ఈ రెండు సంస్థలు కలిసి 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.15,000 కోట్లు) పెట్టుబడితో పశ్చిమ అబుదాబిలో సంయుక్తంగా పెట్రోరసాయనాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.

Reliance ta'ziz deal
అబుదాబిలో రిలయన్స్‌ పెట్టుబడులు

By

Published : Dec 8, 2021, 7:36 AM IST

Reliance ta'ziz: ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), అబుదాబి కెమికల్స్‌ డెరివేటివ్స్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్‌ (టాజిజ్‌)తో కలిసి సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం వెల్లడించింది. 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.15,000 కోట్లు) పెట్టుబడితో ఇది ఏర్పాటు కానుంది. ఈ రెండు సంస్థలు కలిసి పశ్చిమ అబుదాబిలో సంయుక్తంగా పెట్రోరసాయనాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. అబుదాబి ప్రభుత్వరంగ ఇంధన దిగ్గజం అబుదాబి నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ఏడీఎన్‌ఓసీ), ప్రభుత్వరంగ సంస్థ ఏడీక్యూలు ఇటీవల సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థే టాజిజ్‌. పశ్చిమ అబుదాబిలోని రువాయిస్‌ ప్లాంట్‌ను అభివృద్ధి చేయడానికి దీన్ని ఏర్పాటు చేశారు.

Ril Ruwais:ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రసాయనాల ఉత్పత్తి కోసం రువాయిస్‌లోని టాజిజ్‌ ఇండస్ట్రియల్‌ కెమికల్స్‌ జోన్‌లో టాజిజ్‌ ఈడీసీ అండ్‌ పీవీసీ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం కోసం టాజిజ్‌, ఆర్‌ఐఎల్‌ ఒప్పందం చేసుకున్నాయి. ఈ కొత్త సంయుక్త సంస్థ ఏడాదికి 9.40 లక్షల టన్నుల క్లోర్‌-ఆల్కలీ, 11 లక్షల టన్నుల ఇథిలీన్‌ డైక్లోరైడ్‌ (ఈడీసీ), 3.60 లక్షల టన్నుల పాలీవినైల్‌ క్లోరైడ్‌ (పీవీసీ) ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, నిర్వహించనుంది. ఇందుకోసం 200 కోట్ల డాలర్లకు పైగా వెచ్చించనున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పరిశ్రమల మంత్రి సుల్తాన్‌ అహ్మద్‌ జబర్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ సమక్షంలో సంయుక్త సంస్థ ఒప్పంద పత్రాలపై తాజిజ్‌ సీఈఓగా వ్యవహరిస్తున్న ఖలీఫా మెహిరి, ఆర్‌ఐల్‌ వ్యూహాలు, వ్యాపార అభివృద్ధి విభాగాధిపతి కమల్‌ నానావతి సంతకాలు చేశారు. టాజిజ్‌ ఇండస్ట్రియల్‌ కెమికల్‌ జోన్‌ ప్రాజెక్టులు ప్రస్తుతం డిజైన్‌ దశలో ఉన్నాయని, 2025 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవీ ప్రత్యేకతలు

  • క్లోర్‌-ఆల్కలీ: నీటి శుద్ధి, వస్త్ర-లోహాల తయారీలో వినియోగం
  • ఇథిలీన్‌ డైక్లోరైడ్‌: పాలీవినైల్‌ క్లోరైడ్‌ తయారీకి వాడతారు
  • పీవీసీ: పైపులు, ఫిట్టింగులు, ప్రొఫైల్స్‌, ట్యూబ్‌లు, కిటికీలు, తలుపులు, సైడింగ్స్‌, వైరు, కేబుల్‌, ఫిల్మ్‌, షీట్‌, ఫ్లోరింగ్‌లో ముడిపదార్థంగా ఉపయోగిస్తారు.

ఇదీ చూడండి:Triguni EzE Eats Story: వయసు డెబ్భై.. సంపాదన రూ. కోట్లలో...

ఇదీ చూడండి:కొత్త సంవత్సరం నుంచి ఏటీఎం ఛార్జీల మోత!

ABOUT THE AUTHOR

...view details