'ఎమ్ఐ టీవీ' వినియోగదారుల కోసం 'జియో సినిమా' యాప్ త్వరలో అందుబాటులోకి రానుంది. రిలయన్స్ జియోకు చెందిన పాపులర్ వీడియో ఆన్ డిమాండ్ కంటెంట్ ప్రస్తుతం ఎమ్ఐ టీవీ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
చైనాకు చెందిన తయారీదారు షియోమీ తన టీవీ సిరీస్‌ల్లో... ఓటీటీ, జియో సినిమా అప్లికేషన్లను తీసుకొస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. షియోమీ విడుదల చేసిన ఓ టీజర్లో... ఇకపై ప్రేక్షకులు పెద్ద స్క్రీన్ల్లో జియో సినిమా వీక్షించగలుగుతారని స్పష్టం చేసింది.
ఎమ్ఐ టీవీలో జియో సినిమా
షియోమీ కేవలం స్మార్ట్ఫోన్లను మాత్రమే కాకుండా ఎమ్ఐ టీవీలనూ కూడా భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. సరసమైన ధరల శ్రేణిలో వచ్చి, మంచి సేవలు అందించిన షియోమీ ఉత్పత్తులు భారత్‌లో విశేష ఆదరణ పొందాయి. ఆండ్రాయిడ్ సపోర్టుతో, ప్యాచ్‌వాల్ యూఐతో వచ్చిన ఎమ్ఐ టీవీలు విజయవంతమయ్యాయి.
ప్రస్తుతం వినియోగదారులు వీటిలో ఎక్కువగా ఆన్-డిమాండ్ కంటెంట్‌ను ఇష్టపడుతున్నారు. విరివిగా వినియోగిస్తున్నారు.
రిలయన్స్ జియో...
రిలయన్స్ జియో... ఓటీటీ కంటెంట్‌ను, టీవీ షోలు, సినిమాలను.. 'జియో సినిమా' పేరుతో వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఆన్-డిమాండ్ కంటెంట్ కోరే చందాదారులు ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. 'లైవ్ టీవీ' కోసం 'జియో టీవీ యాప్'ను తీసుకొచ్చింది.
ఎమ్ఐ టీవీ... పెద్ద స్క్రీన్‌లో