కరోనా వేగంగా విస్తరిస్తున్న వేళ టెలికాం సంచలనం జియో మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. కొత్త వినియోగదారులకు ఉచిత బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే కనెక్షన్ తీసుకున్న కస్టమర్లకు రెట్టింపు డేటా సౌలభ్యం కల్పించనున్నట్లు వెల్లడించింది. కరోనా ప్రభావంతో ఇంటి నుంచి పనిచేస్తున్న వారికి మద్దతుగా ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు జియో పేర్కొంది. భౌగోళిక సాధ్యాసాధ్యాలకు లోబడి ఉచిత సేవలు అందించనున్నట్లు స్పష్టం చేసింది.
"ఇంట్లో ఉన్నప్పుడు అందరూ తమ సంబంధాలను కొనసాగించేలా బేసిక్ జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను(10 ఎంబీపీఎస్ వరకు) జియో ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండా ఈ(కరోనా వైరస్) కాలవ్యవధిలో అందిస్తుంది. హోమ్ గేట్‌వే రూటర్లను సైతం అతి తక్కువ డిపాజిట్‌తో(రీఫండబుల్) జియో అందిస్తుంది."
-జియో సంస్థ