అలోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో వాటిని ఉపసంహరించుకున్న యోగా గురు బాబా రాందేవ్ సోమవారం మళ్లీ సరికొత్త వాదనలతో ముందుకొచ్చారు. కొన్నింటికి అలోపతిలో శాశ్వత చికిత్స ఎందుకు లేదంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)కు 25 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విటర్లో బహిరంగ లేఖ రాశారు.
- బీపీ, మధుమేహానికి అలోపతిలో ఎందుకు శాశ్వత చికిత్స లేదు?
- థైరాయిడ్, ఆర్థరైటిస్, కోలిటిస్, ఉబ్బస వ్యాధుల శాశ్వత నివారణకు ఫార్మా కంపెనీల వద్ద మందులు ఉన్నాయా?
- కాలేయ వ్యాధి చికిత్సకు, గుండెలో అడ్డంకులకు, కొవ్వుకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి?
- పార్శపు నొప్పి, మతిమరుపు, పార్కిన్సన్ వ్యాధులను ఏ విధంగా నయం చేస్తారు?
- అలోపతి సర్వగుణ సంపన్నమని భావించకూడదు. ఎందుకంటే దీని వయసు 200 ఏళ్లే..వీటితోపాటు మరిన్ని ప్రశ్నలనూ సంధించారు.
ఆ అధికారికి చికిత్సలో మా ప్రమేయం లేదు