తెలంగాణ

telangana

ETV Bharat / business

మరింత పారదర్శకంగా క్లెయిమ్​​ సెటిల్​మెంట్​ - క్లెయిమ్ సెటిల్​మెంట్ ప్రక్రియ పారదర్శకంగా

ఆరోగ్య బీమా పాలసీల క్లెయిమ్​లలో మరింత పారదర్శకత ఉండాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్​డీఏఐ) బీమా సంస్థలను ఆదేశించింది. బీమాను తిరస్కరించే సందర్భంలో తగిన కారణాలను వివరించాలని తెలిపింది. క్లెయిమ్ సెటిల్​మెంట్​ సహా.. బీమా ఛార్జీల పెంపు అంశాలపై మరింత అవగాహన కల్పించాలని సూచించింది.

Irdai asks insures to be more transparent in health insurance claims settlement, specify reasons of denial
మరింత పారదర్శకంగా క్లెయిమ్​​ సెటిల్​మెంట్​

By

Published : Mar 21, 2021, 7:41 PM IST

బీమా సంస్థలన్నీ ఆరోగ్య బీమా క్లెయిమ్ సెటిల్​మెంట్ ప్రక్రియలో మరింత పారదర్శకంగా ఉండాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్​డీఏఐ) ఆదేశించింది. క్లెయిమ్‌ను తిరస్కరించినట్లయితే పాలసీదారులకు తగిన కారణాలను పక్కాగా తెలియజేయాలని నిర్దేశించింది. ఈ మేరకు క్లెయిమ్ ప్రక్రియలో.. పాలసీదారులకు స్పష్టమైన, పారదర్శక సమాచారాన్ని అందించేలా బీమా సంస్థలు విధివిధానాలను రూపొందించాలని ఐఆర్​డీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.

అప్​డేట్లు తప్పనిసరి..

పాలసీదారుడు క్లెయిమ్​ చేసుకునేందుకు నగదు రహిత అభ్యర్థనలను స్వీకరించాలని ఐఆర్​డీఏఐ సూచించింది. పాలసీదారులకు క్లెయిమ్​ స్టేటస్​ను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు బీమా సంస్థలు వ్యవస్థలను కలిగి ఉండాలని సూచించింది. సదరు అభ్యర్థన అందినప్పటి నుంచి తగిన నిర్ణయం తీసుకునే వరకు స్టేటస్​ను తెలియజేస్తూ ఉండాలని తెలిపింది.

తిరస్కరణకు పక్కా కారణం..

బీమా సంస్థల తరఫున టీపీఏలు క్లెయిమ్‌లను పరిష్కరిస్తున్నట్లయితే.. వాటి స్థితిని తెలుసుకునేందుకు పాలసీదారులకు సమాచారం ఇవ్వాలని నియంత్రణ సంస్థ సూచించింది. అలాగే ఊహలు, అంచనాలను బట్టి క్లెయిమ్​లను తిరస్కరించొద్దని బీమా సంస్థలను కోరింది. హెల్త్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్-2016 ప్రకారం.. తిరస్కరణకు గల నిర్ధిష్ట కారణాలను తెలియజేయాల్సి ఉంటుందని తెలిపింది.

సెటిల్మెంట్..

పాలసీదారులకు క్లెయిమ్​ చెల్లింపులు జరపకపోతే.. అందుకుగల కారణాలను తప్పనిసరిగా తెలియజేయాలని పేర్కొంది. ఈ వివరాలను ఆయా కంపెనీలోని ఫిర్యాదుల పరిష్కార విభాగం సహా.. బీమా అంబుడ్స్‌మన్‌తో పాటు సంబంధిత కార్యాలయాలకూ అందించాలని స్పష్టం చేసింది. 'హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్మెంట్' పేరిట.. జీవిత, సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు సహా.. థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్(టీపీఏ)లు ఈ నిబంధనలు పాటించేలా ప్రకటనను విడుదల చేసింది ఐఆర్​డీఏఐ.

ఈ చర్యలతో క్లెయిమ్​లు పారదర్శకంగా, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కారం అవుతాయని ఐఆర్​డీఐఏ అంచనా వేసింది. బీమా సంస్థలు, టీపీఏలు.. అవసరమైన ప్రతి చోటా ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. పంట బీమా, క్రెడిట్ బీమా రంగానికి ఈ మార్గదర్శకాలు వర్తించవని ఐఆర్​డీఏఐ తెలిపింది.

ఇదీ చదవండి:మార్చి వరకు బీమా ఆన్‌లైన్‌: ఐఆర్​డీఏఐ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details