ఈ వారం స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ అంశాలే కీలకం కానున్నాయి. దేశీయంగా ఎలాంటి వార్తలు, ప్రకటనలు లేనందున మదుపరులు.. కొవిడ్ టీకా, అమెరికా ఉద్దీపన ప్యాకేజీలపై దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ వారాంతంలో శుక్రవారం క్రిస్మస్ సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఎఫ్ అండ్ ఓ డెరివేటివ్‌ల గడువు ముగింపు నేపథ్యంలో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవ్వచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ రిటైల్ అధిపతి(రీసెర్చ్) సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు.
దేశీయ సూచీలు ఇటీవల రికార్డు స్థాయి గరిష్ఠాలను తాకిన నేపథ్యంలో.. ఈ వారం మదుపరులు అడపాదడపా లాభాల స్వీకరణకు దికే అవకాశాలే ఎక్కువని విశ్లేషించారు.