స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కాస్త తేరుకోవడం కారణంగా మదపరుల సంపద నెమ్మదిగా రికవరీ అవుతోంది. గురువారం నాటి రికార్డు స్థాయి నష్టాలతో సుమారు రూ.11 లక్షల కోట్లు కోల్పోయిన బీఎస్ఈ మదుపరులు.. సెన్సెక్స్ నేడు 1,325 పాయింట్లు పుంజుకున్న నేథ్యంలో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
మదుపరుల సంపద రూ.3.55 లక్షల కోట్లు వృద్ధి - BUSINESS NEWS
స్టాక్ మార్కెట్ల రికవరీతో మదుపరులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సెన్సెక్స్ నేడు భారీ లాభాలను నమోదు చేసిన కారణంగా.. బీఎస్ఈ మదుపరుల సంపద రూ.3.55 లక్షల కోట్లు పెరిగింది.
పెరిగిన మదుపరుల సంపద
సంపద వృద్ధి..
- బీఎస్ఈ మదుపరుల సంపద నేడు రూ.3,55,590.19 కోట్లు పెరిగింది.
- బీఎస్ఈ నమోదిత కంపెనీల మొత్తం ఎం-క్యాంప్ నేడు 1,29,26,242.82 కోట్లకు చేరింది.
ఇదీ చూడండి:మార్కెట్ గమనంపై కేంద్రం నిశిత పరిశీలన