భారత్లో జలవిద్యుత్ మినహా.. పునరుత్పాదక శక్తి ఉత్పత్తి సామర్థ్యం గురువారానికి 100 గిగావాట్లు దాటినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో ప్రపంచంలో అత్యధిక పునరుత్పాదక శక్తి ఉత్పత్తి సామర్థ్యం గల నాలుగో దేశంగా భారత్ నిలిచిందని పేర్కొంది. ఇది ఓ మైలురాయిగా నిలవనుందని తెలిపింది. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో 5వ స్థానం, పవన విద్యుత్ ఉత్పత్తిలో 4వ స్థానంలో కొనసాగుతున్నామని తెలిపింది.
ప్రస్తుతం 50 గిగావాట్ల సామర్థ్యం చేరే దిశగా కేంద్రాలు నిర్మిస్తున్నామని.. మరో 27 గిగావాట్లకు కేంద్రాలు నిర్మించనున్నామని ప్రభుత్వం తెలిపింది.