ప్రైవేటు చార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లకు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండటానికి తోడు కొవిడ్ నేపథ్యంలో సురక్షిత ప్రయాణానికి కుబేరులు వీటిని బుక్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. కొవిడ్ కారణంగా గతేడాది చార్టర్డ్ విమానాల బుకింగ్‌లు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్‌కు ముందు కూడా చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించిన వారు కొందరైతే.. ఇదివరకు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన అత్యధిక సంపన్నుల్లోని కొందరు కొవిడ్ భయంతో ఇప్పుడు ప్రైవేటు చార్టర్డ్ విమానం బుక్ చేసుకుని వెళ్తున్నారని సమాచారం. కుటుంబ సభ్యులు, సన్నిహితులైన స్నేహితులు కలిసి వెళ్లేందుకు ఇలా విమానం బుక్ చేసుకుంటున్నారని క్లబ్ వన్ ఎయిర్ సంస్థ తెలిపింది. ఒక్కో విమానం కొవిడ్ ముందు నెలలో 40-50 గంటల పాటు నడిచేదని, ఇప్పుడు కూడా మళ్లీ ఆ స్థాయిలో కార్యకలాపాలు నడుస్తున్నాయని పేర్కొంది.
- ఎన్నికల ప్రచారానికి అనువుగా హెలికాప్టర్లను రాజకీయ పార్టీలు బుక్ చేసుకుంటున్నాయి. సాధారణంగా ఓఎన్‌జీసీ, రాష్ట్ర ప్రభుత్వాలు, మతపరమైన పర్యటనలకు హెలికాప్టర్లు ఎక్కువగా బుక్ అవుతుంటాయని 12 హెలికాప్టర్లను నిర్వహిస్తున్న గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్స్ తెలిపింది. ఇప్పుడు మాత్రం అన్ని హెలికాప్లర్లు ఎన్నికల ప్రచారానికి తరలివెళ్లినట్లు పేర్కొంది.
- విమానాలను లీజుకు ఇచ్చే సంస్థల నుంచి రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న మధ్యవర్తులు తీసుకుంటుంటారు. తదుపరి వారు ఆయా పార్టీల అవసరాల మేరకు పంపుతుంటారు.
పర్యటక సీజన్ మే-అక్టోబరు