ఆదాయపుపన్ను శాఖ టీడీఎస్ ఫారమ్‌లో మార్పులు చేసింది. దీనిని మరింత సమగ్రంగా మార్చింది. పన్ను టీడీఎస్‌ను ఎందుకు చెల్లించడం లేదో దీనిలో వెల్లడించాల్సి ఉంటుంది. దీంతో పాటు బ్యాంకులు కూడా రూ.కోటి కంటే ఎక్కువ విత్‌డ్రాలపై టీడీఎస్ రిపోర్టును ఇవ్వాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఇప్పటికే ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు చేసింది. వీటిల్లో ఇ-కామర్స్ ఆపరేటర్లను కూడా చేర్చింది. దీంతోపాటు మ్యూచివల్ ఫండ్స్ డివిడెండ్స్ పంపిణీ, బిజినెస్ ట్రస్ట్‌లు, నగదు విత్‌డ్రాలు, ప్రొఫెషనల్ ఫీజులు, వడ్డీలు వంటి అంశాలను చేర్చారు.