దక్షిణ అమెరికాలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అర్జెంటీనాను ఆర్థిక మాంద్యం పట్టి పీడిస్తోంది. డాలర్‌తో పోలిస్తే అర్జెంటైన్ కరెన్సీ పెసో విలువ పడిపోతుండడం.. ద్రవ్యోల్బణం భారీ స్థాయిలో నమోదు కావడం వల్ల జనాల జేబులు ఖాళీ అవుతున్నాయి. నిత్యావసరాలు సహా ఏదీ కొనలేని పరిస్థితి నెలకొంది. చివరికి కండోమ్ కొనేందుకు కూడా ప్రజలు వెనకడుగు వేస్తున్నారని వాటి తయారీ దారులు, ఔషధ దుకాణాల యజమానులు చెబుతున్నారు.
ఈ ఏడాది కండోమ్‌ల అమ్మకాలు 8 శాతం, గర్భ నిరోధక మాత్రల అమ్మకాలు 6 శాతం మేర పడిపోవడం ఆర్థిక మాంద్యం దుస్థితికి అద్దం పడుతోంది.
అర్జెంటీనాలో ప్రముఖ నటుడైన గిల్లెర్మో అక్వినో ఓ వీడియోలో మాట్లాడుతూ.. "పెసో విలువ దిగజారిపోవడం నన్ను బాధిస్తోంది. కనీసం నా భాగస్వామిని కూడా సుఖపెట్టలేకపోతున్నాను. నా దగ్గర ఒకే ఒక కండోమ్ మిగిలింది. ఇదంతా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి వల్లే తలెత్తింది’’ అని అన్నాడు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అయింది.
36 శాతం పెరిగిన ధర..