తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐఎల్​ఎఫ్​ఎస్​ కేసులో ఠాక్రేకు ఈడీ సమన్లు

ఐఎల్ అండ్ ఎఫ్​ఎస్​ సంస్థ బకాయిల ఎగవేత వ్యవహారంలో ఎంఎన్ఎస్ అధినేత రాజ్​ ఠాక్రేకు ఈడీ సమన్లు జారీచేసింది. మనీలాండరింగ్​ కేసు విచారణ కోసం ఈనెల 22న విచారణకు రావాలని సూచించింది.

ఐఎల్​ఎఫ్​ఎస్​ కేసులో ఠాక్రేకు ఈడీ సమన్లు

By

Published : Aug 19, 2019, 2:20 PM IST

Updated : Sep 27, 2019, 12:41 PM IST

రూ.91 వేల కోట్ల మేర అప్పుల్లో చిక్కుకున్న ఐఎల్​ అండ్​ ఎఫ్​ఎస్​ సంస్థకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్​ ఠాక్రేకు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్​ కేసు విచారణ కోసం ఈనెల 22న దిల్లీలోని ప్రధాన కార్యాలయానికి రావాలని సూచించింది.

ఠాక్రేతో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన నాయకుడు మనోహర్​ జోషి కుమారుడు ఉమేష్​ జోషికి సమన్లు జారీ చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్. ఉమేష్ జోషిని సోమవారం లేదా మంగళవారం విచారణకు రావాలని ఆదేశించింది.

కోహినూర్​ సీటీఎన్​ఎల్​ అనే సంస్థలో ఐఎల్​ఎఫ్​ఎస్​ పెట్టుబడికి సంబంధించి ఠాక్రే, జోషి పాత్రపై ఈడీ ప్రశ్నించాలని భావిస్తున్నట్లు సమాచారం. కోహినూర్​ సీటీఎన్​ఎల్​ సంస్థకు జోషి ప్రమోటర్​గా వ్యవహరించారు. తొలుత కోహినూర్​కు సంబంధించిన ఆస్తుల కొనుగోలుకు బిడ్ వేసిన ఠాక్రే, జోషి... తర్వాత ఆ ప్రక్రియ నుంచి వైదొలిగారు. ఈ మొత్తం వ్యవహారంలో మనీలాండరింగ్​ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఇదీ చూడండి:కశ్మీర్: పాఠశాలలు షురూ- విద్యార్థులు గైర్హాజరు

Last Updated : Sep 27, 2019, 12:41 PM IST

ABOUT THE AUTHOR

...view details