దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి-మార్చి (గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే) మధ్య 21 శాతం పెరిగాయి. ఇదే సమయంలో కొత్త ఇళ్ల సప్లయి మాత్రం 40 శాతం తగ్గినట్లు ప్రాప్ఈక్విటీ సంస్థ నివేదికలో వెల్లడైంది.
కరోనా రెండో దశ నేపథ్యంలో రాష్ట్రాల వారీగా విధించిన పాక్షిక, సంపూర్ణ లాక్డౌన్ల కారణంగా ఏప్రిల్-జూన్ మధ్య డిమాండ్ మందగించే అవకాశముందని తెలిపిందీ నివేదిక.
2021 జనవరి-మార్చి మధ్య ఇళ్ల విక్రయాలు ఇలా..
- మొత్తం 1,05183 ఇళ్లు విక్రయమయ్యాయి. 2020 క్యూ1లో ఈ సంఖ్య 87,236గా ఉండటం గమనార్హం.
- కొత్తగా 59,737 యూనిట్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1,00,343గా ఉంది.
- బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి, దిల్లీ, పుణె నగరాల్లో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. కోల్కతాలో మాత్రం 20 శాతం విక్రయాలు పడిపోయాయి.
ఇదీ చదవండి:జీవితకాల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం!