ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు (Hosing sales data India) భారీగా పెరిగినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా తాజా నివేదిక (JLL housing sales report) వెల్లడించింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు రెండు రెట్లకుపైగా పెరిగి.. 32,358 యూనిట్లుగా నమోదైనట్లు వెల్లడించింది.
గత ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 14,415 ఇళ్లు మాత్రమే విక్రయమయ్యాయి. 2021 రెండో త్రైమాసికంలో 19,635 యూనిట్లు అమ్ముడయ్యాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు..
- 2021 క్యూ3లో హైదరాబాద్ (Housing sales in Hyderabad) రెండింతలకుపైగా వృద్ధిని నమోదు చేసింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 4,418 ఇళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 2,122 ఇళ్లు విక్రయమయ్యాయి.
- బెంగళూరులో (Housing sales in Bengaluru) ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 5,100 ఇళ్లు విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 1,742గా ఉంది.
- చెన్నైలో మాత్రం 2021 క్యూ3లో ఇళ్ల విక్రయాలు (Housing sales in Chennai) గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. 1,570 యూనిట్ల నుంచి 1,500 యూనిట్లకు పడిపోయాయి. 7 ప్రధాన నగరాల్లో క్షీణతను నమోదు చేసింది చెన్నై మాత్రమే.
- దిల్లీ-ఎన్సీఆర్లో 2021 జులై-సెప్టెంబర్ 4,418 ఇళ్లు (Housing sales in Delhi-NCR) అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 2,122గా ఉంది.
- కోల్‌కతాలో ఇళ్ల విక్రయాలు (Housing sales in Kolkata) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐదు రెట్లు పెరిగాయి. మొత్తం 1,974 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 క్యూ3లో 390 ఇళ్లు మాత్రమే విక్రయమయ్యాయి.
- ముంబయిలో ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మధ్య 6,756 ఇళ్లు (Housing sales in Mumbai) విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఇక్కడ 4,135 ఇళ్లు అమ్ముడయ్యాయి.
- పుణెలో ఇళ్ల విక్రయాలు (Housing sales in Pune) నాలుగు రెట్లకుపైగా పెరిగాయి. 2021 జులై-సెప్టెంబర్ సమయంలో 5,921 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 1,344 యూనిట్లు విక్రయమయ్యాయి.