తెలంగాణ

telangana

ETV Bharat / business

జీఎస్టీ రేట్ల తగ్గింపుతో... ఆతిథ్య రంగానికి జోష్​

మందగమనంతో సతమతమవుతున్న ఆర్థికవ్యవస్థకు చేయూతనిచ్చేలా కేంద్రప్రభుత్వం పలుకీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఆతిథ్య, పర్యాటక రంగాలకు ఊతమిచ్చేలా హోటల్ గదుల అద్దెపై జీఎస్టీ రేట్లను తగ్గించింది. గోవాలో జరిగిన 37వ జీఎస్టీ మండలిలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

By

Published : Sep 21, 2019, 5:45 AM IST

Updated : Oct 1, 2019, 10:00 AM IST

జీఎస్టీ రేట్ల తగ్గింపుతో... ఆతిథ్య రంగానికి జోష్​

ఆర్థికమాంద్యం పరిస్థితులను అధిగమించేందుకు ఇప్పటికే పలు రంగాలకు ఉద్ధీపనలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్టీ పన్ను రేట్లను తగ్గించింది. గోవాలో జరిగిన 37వ జీఎస్టీ మండలిలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

సేవారంగానికి ఊతం

సేవారంగానికి ఊతమిచ్చే లక్ష్యంతో హోటల్​ గదుల అద్దెలపై జీఎస్టీని తగ్గిస్తున్నట్లు ఆర్థకమంత్రి నిర్మలా సీతారామన్​ పేర్కొన్నారు. ఇది ఆతిథ్యం, పర్యాటక రంగాల పురోభివృద్ధికి దోహదం చేస్తుందని ఆమె అన్నారు.

  • రూ.7,500 వరకు ఉండే హోటల్​ గదుల అద్దెపై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.
  • రూ.7,500లకు పైగా ఉండే హోటల్​ గదుల అద్దెపై జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి సవరించారు.
  • రూ.1000 వరకు ఉండే హోటల్​ గదుల అద్దెపై ఎలాంటి జీఎస్టీ విధించలేదు.
  • ఔట్​ డోర్ క్యాటరింగ్​పై విధించే 18 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు.

చింతపండుకు టైమొచ్చింది

తాజా జీఎస్టీ మండలి సమావేశంలో చింతపండుపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. రాయితో కూడిన వైట్​ గ్రైండర్లపై పన్నును 12 నుంచి 5 శాతానికి తగ్గించారు.

మంచి నిర్ణయం

జీఎస్టీ రేట్లు తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం.. మార్కెట్​ సెంటిమెంట్​ను పెంచుతుందని హోటల్​ రంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది ఆతిథ్య, పర్యాటక రంగాలకు చాలా ఉపకరిస్తుందని పేర్కొన్నారు. పండుగ సీజన్​కు ముందు ప్రభుత్వం చేపట్టిన సానుకూల చర్యలు మార్కెట్​ను లాభాలబాట పట్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ''హౌదీ మోదీ'కి ముందు మార్కెట్ల జోరు అద్భుతమే'

Last Updated : Oct 1, 2019, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details