తెలంగాణ

telangana

ETV Bharat / business

నష్టాల్లోంచి తేరుకొని.. స్వల్పంగా కోలుకొని..​ - రెబల్స్​

స్టాక్​మార్కెట్లు మంగళవారం స్వల్పలాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్​ 65 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11 వేల 350 ఎగువకు చేరింది. ఆరంభ నష్టాల నుంచి తేరుకున్నాయి.

నష్టాల్లోంచి తేరుకొని.. స్వల్పంగా కోలుకొని..​

By

Published : Jul 23, 2019, 10:21 AM IST

Updated : Jul 23, 2019, 4:37 PM IST

స్టాక్​మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సానుకూల సంకేతాల నడుమ.. ఆరంభ ట్రేడింగ్​లో ఫ్లాట్​గా కదలాడిన సూచీలు.. లాభాల బాట పట్టాయి.

గత సెషన్​లో 300 పాయింట్లకు పైగా పతనమైన జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ మంగళవారం ట్రేడింగ్​లో 60 పాయింట్లకు పైగా పెరిగింది. ప్రస్తుతం 38 వేల 96 వద్ద కొనసాగుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ స్వల్ప లాభాల్లో ఉంది. ప్రస్తుతం 16 పాయింట్ల వృద్ధితో .. 11 వేల 362 వద్ద ట్రేడవుతోంది.

లాభనష్టాల్లోనివివే...

ఇన్ఫోసిస్​, కోటక్​మహీంద్రా, విప్రో, యాక్సిస్​ బ్యాంక్​, హీరో మోటోకార్ప్​ లిమిటెడ్​ లాభాలను నమోదు చేశాయి. హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఇన్​ఫ్రాటెల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, యస్​ బ్యాంక్​, సిప్లా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి...

ఆరంభ ట్రేడింగ్​లో రూపాయి స్వల్పంగా 10 పైసలు క్షీణించింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 69.03 వద్ద ఉంది.

Last Updated : Jul 23, 2019, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details