పండుగల వేళ రుణాలు తీసుకునే వారికి 'ఫెస్టివ్ ట్రీట్ 3.0' పేరుతో ప్రత్యేక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెల్లడించింది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్లు, బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా ఈ రాయితీలు అందిస్తున్నామని తెలిపింది. రిటైల్ వినియోగదారుల నుంచి, వ్యాపారుల వరకు అందరూ ఈ రాయితీలు పొందవచ్చని వివరించింది.
పండుగ సీజన్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరే ఆఫర్లు! - కారు రుణాలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్లు
ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దసరా ఆఫర్లు ప్రకటించింది. ఈ-కామర్స్, ఇతర బ్రాండ్లతో ఒప్పందాల ద్వారా భారీ క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ఆఫర్లు ఇలా..
- ప్రీమియం మొబైల్ ఫోన్లపై.. నోకాస్ట్ ఈఎంఐ, క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.
- ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలపై 22.5 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. దీనితో పాటు వడ్డీ లేని ఈఎంఐ సదుపాయం వినియోగించుకోవచ్చని వివరించింది.
- కారు రుణంపై వడ్డీ రేటును 7.50 శాతం తగ్గించినట్లు బ్యాంక్ పేర్కొంది. గడువుకు ముందే రుణం పూర్తిగా చెల్లించినా ఎలాంటి అదనపు రుసుములూ ఉండవని స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనాల కొనుగోలుకు 100 శాతం, ట్రాక్టర్లకు 90% రుణాన్ని అందించనుంది.
- రూ.75 లక్షల హామీ అవసరం లేని రుణాలను కూడా ఇస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇవన్నీ కలిపి మొత్తం 10 వేలకు పైగా ఆఫర్లు అందిస్తున్నట్లు వివరించింది.
ఇది చదవండి:ఆ ఆఫీసులో వారానికి మూడురోజులే పని!
TAGGED:
HDFC Bank festival offers