భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు హాని కలిగిస్తున్నాయి అనే ఆరోపణతో వేటుకు గురైనటిక్టాక్ సహా పలు చైనాఅప్లికేషన్లపై విధించిన నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా సంస్థలకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పంపింది. గతంలో అప్లికేషన్ల యాజమాన్యాలు పంపించిన ప్రత్యుత్తరాలను సమీక్షించినప్పటికీ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులను జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం పంపిన నోటీసులు అందినట్లు టిక్‌టాక్ తెలిపింది. కేంద్రం పంపిన ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తిరిగి ప్రత్యుత్తరం పంపుతామని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
"2020 జూన్ 29న భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంస్థల్లో టిక్‌టాక్ ఒకటి. ఆయా దేశాల చట్టాలను, నిబంధనలను పాటించటానికి మేము కట్టుబడి ఉన్నాము. అందుకు సంబంధించి మా వంతు కృషి చేస్తాము. ప్రభుత్వానికి ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వినియోగదారుల గోప్యత, భద్రతను కాపాడాటమే మా తొలి ప్రాధాన్యత."