తెలంగాణ

telangana

ETV Bharat / business

cryptocurrency news: ఇక 'క్రిప్టో' ఆదాయంపైనా పన్ను- త్వరలో చట్టం!

క్రిప్టోకరెన్సీని(cryptocurrency news) ఆదాయపు పన్ను​ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం(india crypto news). ఇందుకు తగ్గట్టుగా ప్రస్తుత చట్టాల్లో మార్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది(crypto taxation india). వచ్చే బడ్జెట్​ సమావేశాల్లో ఈ మార్పులు కనిపించే అవకాశమున్నట్టు ఓ అధికారి వెల్లడించారు.

cryptocurrency
క్రిప్టోకరెన్సీ

By

Published : Nov 19, 2021, 3:35 PM IST

పన్ను పరిధిలోకి క్రిప్టోకరెన్సీని(cryptocurrency news) తీసుకొచ్చే విధంగా ఆదాయపు పన్ను చట్టాల్లో మార్పులు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం(india crypto news). వచ్చే ఏడాది బడ్జెట్​లో ఈ మార్పులు కనిపించే అవకాశముందని రెవెన్యూ సెక్రటరీ తరుణ్​ బజాజ్​ వెల్లడించారు.

ఆదాయపు పన్ను పరంగా ఇప్పటికే కొందరు క్రిప్టోకరెన్సీలో మూలధన లాభాలపై ట్యాక్స్​ కడుతున్నారని బజాజ్​ వెల్లడించారు. ఇతర సేవలను ఉపయోగించుకున్నట్టే, ఇక్కడ కూడా జీఎస్​టీ ఉంటుందని చట్టాల్లో స్పష్టంగా ఉన్నట్టు పేర్కొన్నారు(crypto taxation india).

"దీనిపై(క్రిప్టోకరెన్సీపై పన్ను) ఓ నిర్ణయం తీసుకుంటాము. ఇప్పటికే ప్రజలు పన్ను కడుతున్నారు. క్రిప్టోకరెన్సీ భారీగా పెరిగిపోయింది. చట్టాల్లో మార్పులు చేయగలమా, లేదా అన్న విషయంపై చర్చిస్తాము. అయితే ఇది బడ్జెట్​ కార్యకలాపాల్లో భాగమే. బడ్జెట్​ సమావేశాలు దగ్గరపడుతున్నాయి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాము."

--- తరుణ్​ బజాజ్​, రెవెన్యూ సెక్రటరీ.

క్రిప్టో ట్రేడింగ్​కు టీసీఎస్​ ప్రవేశపెడతారా అన్న ప్రశ్నకు.. కొత్త చట్టాలను రూపొందించిన తర్వాతే దానిపై స్పష్టత వస్తుందని బదులిచ్చారు బజాజ్.

అతి త్వరలో బిల్లు!

మరోవైపు ఈ నెల 29న ప్రారంభంకానున్న పార్లమెంట్​ సమావేశాల్లో.. క్రిప్టోకరెన్సీపై కేంద్రం బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే విధంగా క్రిప్టోకరెన్సీ ఉందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

దేశంలో ప్రస్తుతానికి క్రిప్టోకరెన్సీపై ఎటువంటి నిషేధం లేదు(india crypto ban). అదే సమయంలో నిబంధనలు కూడా లేవు. క్రిప్టోకరెన్సీపై ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. క్రిప్టోపై కఠిన నిబంధనలు అమల్లోకి వస్తాయని సంబంధిత వర్గాలు సూచించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

అటు ఆర్​బీఐ కూడా క్రిప్టోకరెన్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశ ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టో ప్రమాదకరమని అభిప్రాయపడింది. క్రిప్టో మార్కెట్​ విలువ, అందులో ట్రేడింగ్​ చేస్తున్న పెట్టుబడిదారుల సంఖ్యపైనా అనుమానం వ్యక్తం చేసింది.

క్రిప్టోకరెన్సీని నిషేధిస్తూ(cryptocurrency ban in india) మార్చి 2020లో ఆర్​బీఐ జారీచేసిన సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అయితే పలు ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో.. అధికారిక డిజిటల్ కరెన్సీ ఉంటే మంచిదనే అభిప్రాయాన్ని ఆర్​బీఐ వెల్లడించింది.

క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే అది రెట్టింపు అవుతుందని టీవీ, వెబ్​సైట్లలో అనేక ప్రకటనలు వస్తున్నాయి. రూ.100తో కూడా ఇన్వెస్ట్​మెంట్​ ప్రారంభించవచ్చని యువతను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇవీ చూడండి:-

ABOUT THE AUTHOR

...view details