తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్బీఐ నుంచి కేంద్రానికి రూ.30వేల కోట్ల మధ్యంతర డివిడెండ్! - కేంద్ర ప్రభుత్వం

ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం చేపడుతున్న చర్యలు ప్రభుత్వ ఖజానాపై ప్రభావం చూపుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యమూ దారితప్పే పరిస్థితి ఏర్పడింది. ఈ లోటు పూడ్చుకోవడానికి కేంద్రం ఈ సంవత్సరం చివరినాటికి ఆర్​బీఐ నుంచి రూ.30 వేల కోట్లు మేర మధ్యంతర డివిడెండ్​ కోరనుందని సమాచారం.

ఆర్బీఐ నుంచి కేంద్రానికి రూ.30వేల కోట్ల మధ్యంతర డివిడెండ్!

By

Published : Sep 29, 2019, 6:21 PM IST

Updated : Oct 2, 2019, 12:01 PM IST

కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆర్​బీఐ నుంచి సుమారు 30 వేల కోట్ల రూపాయల మధ్యంతర డివిడెండ్ కోవచ్చని సమాచారం. కేంద్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 3.3 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందువల్ల ఈ ఆర్థిక లోటు భర్తీ చేసుకునేందుకు ఆర్​బీఐ నుంచి డివిడెంట్​ కోరే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

"అవసరమైతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వం 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల మేర మధ్యంతర డివిడెండ్​ మంజూరు చేయాలని రిజర్వ్​ బ్యాంకు ఆఫ్ ఇండియాను అభ్యర్థించవచ్చు. ఈ విషయంపై జనవరి ప్రారంభంలో ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది."- ఓ అధికారి

నెమ్మదించిన ప్రగతి రథానికి ఊతమిచ్చేందుకు కేంద్రం ఇటీవల కీలక చర్యలు చేపట్టింది. వృద్ధి తగ్గుదలతో ఆదాయమూ గణనీయంగా తగ్గింది. ఫలితంగా దేశ ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి.

ఇతర మార్గాలూ ఉన్నాయ్​

ఆర్​బీఐ డివిడెండ్ కాకుండా, ఆర్థికలోటు పూడ్చుకునేందుకు ప్రభుత్వానికి ఇతర మార్గాలూ ఉన్నాయి. అవి.. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, నేషనల్​ స్మాల్ సేవింగ్ ఫండ్​ (ఎన్​ఎస్​ఎస్​ఎఫ్​)ను ఉపయోగించుకోవడం.

ప్రభుత్వానికి ఇది అలవాటే...

కేంద్రం తన ఆర్థిక ఖాతాను సమతుల్యం చేసుకునేందుకు... ఆర్​బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్​ తీసుకున్న సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. గతేడాది ఆర్బీఐ... కేంద్రానికి రూ.28,000 కోట్లు మధ్యంతర డివిడెండ్ ఇచ్చింది. 2017-18లో రూ.10 వేల కోట్లు ఇలానే ప్రభుత్వానికి సమర్పించింది.

బ్రహ్మాస్త్రం వాడేశారు......

గత నెలలో గవర్నర్ శక్తికాంత దాస్​ నేతృత్వంలోని ఆర్​బీఐ కేంద్ర బోర్డు 2018-19 సంవత్సరానికి రూ.1,76,051 కోట్లను బదిలీచేయడానికి అనుమతి ఇచ్చింది.
రుణాలు పెరుగుతున్నాయ్​

స్థూల రుణాల విషయానికి వస్తే.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.5.35 లక్షల కోట్లు ఉన్నాయి. ఇవి 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి గణనీయంగా రూ.7.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ప్రభుత్వ స్థూల రుణాలు రూ.4.42 లక్షల కోట్లు ఉంటుంది. ఇది మొత్తం ఆర్థిక సంవత్సర లక్ష్యంలో 62.3 శాతం కావడం గమనార్హం.

ఇదీ చూడండి:మరో పారిశ్రామిక విప్లవం కోసం కేంద్రం కసరత్తు

Last Updated : Oct 2, 2019, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details