తెలంగాణ

telangana

ETV Bharat / business

కొవిడ్​ టీకాకు శీతలీకరణ.. సమర్థ రవాణా ముఖ్యం

కొవిడ్​ వ్యాక్సిన్​ అభివృద్ధి కోసం.. శీతలీకరణ, రవాణా వ్యవస్థలను బలోపేతం చేయాలని అన్నారు బయోటెక్నాలజీ విభాగ శాస్త్రవేత్త, సలహాదారు ఆశా శర్మ. టీకాపై ఉన్న అనుమానాలు తొలగించడంతో పాటు.. వ్యాక్సిన్​ వృథా కాకుండా ముందే చర్యలు తీసుకోవాలని సూచించారు.

cold chain logistics needs to be strengthened
కొవిడ్​ టీకాకు శీతలీకరణ.. సమర్థ రవాణా ముఖ్యం

By

Published : Dec 17, 2020, 7:13 AM IST

కరోనా టీకా అభివృద్ధికి ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది కానీ.. శీతలీకరణ, రవాణా వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీకా అభివృద్ధిలో మొత్తం 30 గ్రూప్‌లు నిమగ్నమై ఉండగా.. ఆరు టీకాలు క్లినికల్‌ పరీక్షల స్థాయిలో ఉన్నాయి. ఇందులో నాలుగు దేశీయంగా తయారు చేస్తున్నవే ఉన్నాయని బయోటెక్నాలజీ విభాగ శాస్త్రవేత్త, సలహాదారు ఆశా శర్మ పేర్కొన్నారు.

సీఐఐ పార్ట్​నర్‌షిప్‌ సమిట్‌ 2020లో జరిగిన ఒక చర్చలో భాగంగా మాట్లాడుతూ 'ప్రభుత్వం దేశవ్యాప్తంగా టీకా అభివృద్ధికి అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే శీతలీకరణ వ్యవస్థలు, రవాణా సరిగ్గా లేకపోతే వ్యాక్సిన్‌ సమర్థతపై ప్రభావం పడుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర సరైన మౌలిక వసతులు లేవ'ని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి సమయంలో శీతలీకరణ వ్యవస్థలు ఎన్ని ఉన్నాయి? ఆరోగ్య సిబ్బంది సామర్థ్యం ఎంత.. అన్న విషయాలు చాలా కీలకమని సనోఫీ పాశ్చర్‌ ఇండియా హెడ్‌ అన్నపూర్ణ దాస్‌ అంటున్నారు. వ్యాక్సిన్‌పై ఉన్న అనుమానాలు తొలగించడంతో పాటు.. టీకా వృథా కాకుండా ముందే చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: పీఎం కేర్స్​ విదేశీ విరాళాలపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం

ABOUT THE AUTHOR

...view details